Begin typing your search above and press return to search.

జడ్జికి గురిపెట్టిన ఖాకీలు !

By:  Tupaki Desk   |   19 Nov 2021 9:44 AM GMT
జడ్జికి గురిపెట్టిన ఖాకీలు !
X
హార్‌ లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ కేసు విచారణ జరుగుతుండగా కోర్టు రూమ్‌ లోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసు అధికారులు జిల్లా అదనపు సెషన్సు కోర్టు జడ్జి అవినాశ్‌ కుమార్‌ పై దాడి చేశారు. జడ్జికి తుపాకీ గురిపెట్టి దాడి చేసిన ఈ దారుణ ఘటన మధుబాని జిల్లా ఝన్‌ ఝర్‌ పూర్‌ లో చోటుచేసుకుంది.

ఈ అనూహ్య ఘటనతో ఆ జడ్జి భయంతో వణికిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో నిందితులైన స్టేషన్‌ హౌస్‌ అఫీసర్‌ గోపాల్‌ ప్రసాద్‌, ఎస్సై అభిమన్యు కుమార్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అనేకమంది న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జోక్యం చేసుకొని జడ్జిని వారి నుంచి కాపాడారు.

నిందితులిద్దరూ ఘొఘార్దియా పోలీస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. నిందితులిద్దరూ ఏదో కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఈ దాడికి పాల్పడటం గమనార్హం.

జిల్లా అదనపు సెషన్సు కోర్టు జడ్జి (ఏడీజే) అవినాష్‌ కుమార్‌పై దాడిని ఝాంఝ్‌ర్‌పూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఖండించింది. ఇది న్యాయ వ్యవస్థను అణచివేసే ప్రయత్నమేనని మండిపడింది. ఎస్పీ పేరును సైతం ప్రస్తావించిన బార్‌ అసోసియేషన్‌ సభ్యులు‌.

ఈ ఘటనలో ఆయన పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంతకముందు నేరస్థుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరేవాళ్లం.. కానీ ఇప్పుడు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరాల్సి వస్తోందని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులతో పాటు ఎస్పీ పేరును కూడా చేర్చాలని, సత్వర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే నిరవధిక సమ్మెకు దిగి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు