Begin typing your search above and press return to search.

యజ్దానీ అస్సలు ఫీల్ కావటం లేదట

By:  Tupaki Desk   |   8 July 2016 7:31 AM GMT
యజ్దానీ అస్సలు ఫీల్ కావటం లేదట
X
హైదరాబాద్ మహా నగరాన్ని తమ కుట్రతో వణికిపోయేలా చేయటానికి వేసిన దారుణ ఫ్లాన్ అమలు కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ పోలీసులు అడ్డుపడిన సంగతి తెలిసిందే. విధ్వంస రచనకు ప్లాన్ చేసిన నిందితులు ప్రస్తుతం పోలీసులకు చిక్కిన వైనం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న వారిలో కుట్రకు ప్లాన్ చేసిన ఇబ్రహీం యజ్దానీ తీరుపై పోలీసుల్లో ఆసక్తికరచర్చ సాగుతోంది.

తాము జరపదలిచిన మారణకాండకు సంబంధించిన డీటైల్స్ చెప్పిన యజ్దాని..అస్సలు ఫీల్ కావటం లేదని చెబుతున్నారు. పోలీసుల విచారణలో తాను చేసింది తప్పన్న భావన అస్సలు కనిపించటం లేదట. అందుకు ప్రతిగా తానుచేయాలనుకున్నది మంచిదని.. తాను అనుకున్న లక్ష్యం కోసం కొందరినిచంపినా.. చనిపోయినా వందరెట్లు పుణ్యం వస్తుందంటూ చెబుతున్న మాటలుచూస్తే.. అతడు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారన్నది ఇట్టే అర్థమయ్యేపరిస్థితి. తాను చేయబోయిన మారణకాండతో తనకు టన్నుల కొద్దీ పుణ్యం లభిస్తుందన్న భావనలో యజ్దాని ఉండటం గమనార్హం.

మరి.. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారికి.. రంజాన్ పర్వదినం సందర్భంగా తమకుటుంబ సభ్యులతో.. తమకు నచ్చిన ఆహార పదార్థాలు తినాలన్న కోరికను అధికారులు ఓకే చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ తాను జరపదలిచిన మారణకాండ మంచి కోసమేనన్నట్లుగా ఫీల్ అవుతున్నవారికి.. వారు కోరుకున్నట్లుగా వసతులు ఏర్పాటు చేయటంపై పలువురువిమర్శిస్తుండగా.. ఇవన్నీ పోలీసు అధికారులకు తెలియనివి కావని.. కాకుంటే లేనిపోని విమర్శలు తమ మీద పడకుండా ఉండేందుకు ఇలాంటి వాటికి పోలీసులు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.