Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్ పంచ్ పై పోలీసుల‌ విచార‌ణ ఇలా!

By:  Tupaki Desk   |   26 April 2017 5:28 AM GMT
పొలిటిక‌ల్ పంచ్ పై పోలీసుల‌ విచార‌ణ ఇలా!
X
సోష‌ల్ మీడియాలో శాస‌న‌మండ‌లిని అభ్యంత‌ర‌క‌రంగా చూపిస్తూ పోస్టింగులు పెట్టార‌న్న ఆరోప‌ణ‌పై పొలిటిక‌ల్ పంచ్ నిర్వాహ‌కుడు ఇంటూరు ర‌వికిర‌ణ్ ను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు విచార‌ణ కోసం మంగ‌ళ‌వారం పిలిపించ‌టం తెలిసిందే. దాదాపు మూడున్న‌ర గంట‌ల పాటు సాగిన ఈ విచార‌ణ‌లో ఏం జ‌రిగింది? తుళ్లూరు పోలీసుల ప్ర‌శ్న‌లు ఎలా సాగాయి? విచార‌ణ సంద‌ర్భంగా వారేం ప్ర‌శ్నించారు? ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ర‌వికిర‌ణ్ ఏమ‌ని స్పందించారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చూస్తే..

శాస‌న‌మండ‌లిని కించ‌ప‌రస్తూ పోస్టింగ్ లు పెట్టిన వైనంపై ర‌వికిర‌ణ్ ను పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మండ‌లిపై తాను పోస్ట్ పెట్ట‌టం త‌ప్ప‌ని తెలీద‌ని.. అయితే.. రెండు నెల‌ల క్రితం పెట్టి డిలీట్ చేసిన పోస్టింగ్‌ కు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నార‌న్న సూటి ప్ర‌శ్న‌ను సంధించారు. ఇదిలా ఉంటే.. విచార‌ణ సంద‌ర్భంగా అద‌న‌పు ఎస్పీ వైటీ నాయుడు.. ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ ప‌లు ద‌ఫాలుగా విచారించారు. మంగ‌ళ‌వారం రాత్రితొమ్మిది గంట‌ల వ‌ర‌కూ సాగిన విచార‌ణ సంద‌ర్భంగా జ‌గ‌న్ పార్టీతో సంబంధాలు ఉన్నాయ‌ని ఒప్పుకోవాల‌ని.. ఆ పార్టీ సూచ‌న మేర‌కే పోస్టింగులు పెడుతున్న‌ట్లుగా సంత‌కాలు చేయాలంటూ పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 30న మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా చెప్పి పంపిన‌ట్లుగా చెబుతున్నారు. తాను ఫ్రీ లాన్స్ జ‌ర్న‌లిస్టున‌ని.. త‌న‌కు జ‌గ‌న్ అంటే అభిమాన‌మే త‌ప్పించి ఆ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.
అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీలో ఉన్న కొన్ని పోస్టింగుల‌ను స్ఫూర్తిగా తీసుకొని తాను పోస్టింగ్ లు పెట్టిన‌ట్లుగా చెప్పిన ర‌వికిర‌ణ్‌.. జ‌గ‌న్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ చ‌ల్లా మ‌ధుసూద‌న్ రెడ్డిని సైతం తుళ్లూరు పోలీసులు విచార‌ణ‌కు పిలిచి.. విచారించారు. ఈ సంద‌ర్భంగా పొలిటిక‌ల్ పంచ్ ర‌వికిర‌ణ్‌ కు..జ‌గ‌న్ పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ‌కు.. ర‌వికిర‌ణ్‌కు సంబంధం లేద‌ని విచార‌ణ‌లోమ‌ధుసూద‌న్ రెడ్డి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ సంద‌ర్భంగా పోలీసులు త‌న‌పై ప‌లుమార్లు ఒత్తిళ్లు తీసుకొచ్చిన‌ట్లుగా మ‌ధు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. జ‌గ‌న్ పైన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను కించ‌ప‌రుస్తూ టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం చేసిన ప‌లు అభ్యంత‌ర‌క‌ర పోస్టింగుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మ‌ధుసూద‌న్ ఫిర్యాదుల్ని పోలీసులు అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని చెబుతున్నారు. ర‌వికిర‌ణ్ పెట్టిన పోస్టింగ్ పై ఇంత రార్దాంతం చేస్తున్న ప్ర‌భుత్వం.. తాము చేస్తున్న కంప్లైంట్ మీద ఎందుకు స్పందించ‌టం లేదంటూ సూటిగా ప్ర‌శ్నించారు. మొత్తంగా.. పోలీసుల విచార‌ణ‌లో భారీ డ్రామా చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/