Begin typing your search above and press return to search.
రాజయ్య ఇంట్లో జరిగింది హత్యేనా?
By: Tupaki Desk | 5 Nov 2015 9:05 AM GMTమాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో కోడలు - ముగ్గురు పిల్లల మృతికి ఆత్మహత్య కారణం కాదని, వారు హత్యకు గురయ్యారని ఆధారం దొరికినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు దీనికి సంబంధించిన ఆధారాలు దొరకడంతో దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో గురువారం ఉదయం నుంచి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇది హత్యే అనడానికి సంబంధించిన ఆధారాలు దొరికినట్లుగా పోలీసు శాఖ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. సారిక - ఆమె ముగ్గురు పిల్లలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన తరువాత వారు మత్తులో కింద పడిపోగా నిప్పు పెట్టినట్లుగా బలంగా అనుమానిస్తున్నారు. దీంతో వారు ముందు రోజు రాత్రి తిన్న ఆహార శాంపిళ్లను సేకరించారు.
సారిక కేసులో చిక్కుముడులు దాదాపుగా వీడాయని పోలీసులు పేర్కొంటున్నారు. అనిల్ రెండో భార్య సనను అదుపులోకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. దీంతో అందరి వేళ్లూ ఇప్పుడు అనిల్ - సనాలవైపే చూపిస్తున్నాయి. కచ్చితంగా ఇది హత్యేనని... ఆత్మహత్య కాదని వరంగల్ లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
అయితే.. పోలీసులు దీనిపై అధికారికంగా వివరాలు చెప్పకపోవడం... దర్యాప్తు పూర్తయ్యే వరకు గోప్యత పాటిస్తుండడంతో పక్కాగా దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. కానీ, హత్యేనని తేలిందని అనధికారిక సమాచారం.