Begin typing your search above and press return to search.

నిందుతుడు శ్రీనివాస్ ఖాతాల్లో భారీ మొత్తం.?

By:  Tupaki Desk   |   28 Oct 2018 6:27 AM GMT
నిందుతుడు శ్రీనివాస్ ఖాతాల్లో భారీ మొత్తం.?
X
తీగ లాగితే డొంక కదులుతోంది. జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ రావు ధీమాగా ఉన్నాడు. అతడి కుటుంబంలో కూడా పశ్చాత్తాపం లేదు. వారంతా ఆనందంగా విలేకరులతో మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు ఎలాగైనా సరే తప్పించుకుంటాడన్న ధీమా వారిలో కనపడుతోంది. అంతేకాదు.. శ్రీనివాసరావు ఇటీవలే కోటీ రూపాయలు పెట్టి ఓ నాలుగు ఎకరాల స్థలం కొనేందుకు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. ఇంతలోనే ఈ క్రైం చేసి దొరికిపోయాడట.. కడు పేదరికంలో ఉండే శ్రీనివాసరావుకు ఆ డబ్బు ఎక్కడిది.? టీడీపీ నేత రెస్టారెంట్ లో శ్రీనివాసరావు అధిక జీతం.. స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చేవారట... సీసీ కెమెరాకు చిక్కని విధంగా ఓ మూలన అతడి బ్యాగు పెట్టుకునేలా ఏర్పాట్లు చేశారట.. ఇలా నిందితుడిని పకడ్బందీగానే జగన్ పై దాడికి కొందరు టీడీపీ నేతలు వెనకుండి ఉసిగొల్పారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత రెస్టారెంట్ లో వెయిటర్ గా అందుకే చేర్పించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాసరావు పై ఫుల్ ఫోకస్ పెట్టిన పోలీసులు అతడి వివరాలన్నీ సేకరిస్తున్నారు. అతడికంటే ముందే మీడియా మొత్తం కూపీలాగుతోంది. తాజాగా విశాఖ సిట్ అధికారుల బృందం శ్రీనివాస్ ను విచారించింది. జగన్ పై సానుభూతికోసమే దాడి అని మళ్లీ బుకాయిస్తున్నాడట.. వీరితోపాటు శ్రీనివాసరావు కుటుంబసభ్యులు ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మడలం ఠాణేలంక లో తాజాగా పోలీసులు విచారించారు. శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల్ని గుర్తించారు. మూడు బ్యాంకు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో నగదు జమ విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆదివారం కావడంతో బ్యాంకుకు రేపు వెళ్లి ఎవరు డబ్బులు వేశారన్నది అధికారులు ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.

నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు జీవితం ఎనిమిది నెలలుగా విలాసవంతంగా నడుస్తోందని ఆయన సొంతూరు వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే అన్న కొడుకు ఫంక్షన్ కు భారీగా డబ్బు ఖర్చు పెట్టి విలాసవంతంగా నిర్వహించాడట.. అంతేకాదు.. నిరుపేద అయిన శ్రీనివాసరావు అకౌంట్లలో అంత పెద్ద ఎత్తున నగదు ఎలా జమ అయ్యింది.? దీని వెనుక ఎవరున్నారన్నది ఆసక్తిగా మారింది. మూడు బ్యాంకు పుస్తకాల్లో లావాదేవీలను సోమవారం తరిచి చూస్తే ఆ నిందితులు ఎవరనేది తేలిపోతుందని.. ఈ కేసు మిస్టరీ వీడబోతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేగుతోందట.. ముఖ్యంగా శ్రీనివాసరావును పనిలో పెట్టుకున్న రెస్టారెంట్ ఓనర్ చుట్టే ఈ కేసు బిగుసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి