Begin typing your search above and press return to search.

రవిప్రకాశ్ కు చుక్కలే..చేతిరాతనూ పరిశీలిస్తున్నారట

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:37 PM GMT
రవిప్రకాశ్ కు చుక్కలే..చేతిరాతనూ పరిశీలిస్తున్నారట
X
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పాలి. టీవీ 9 కొత్త యాజమాన్యాన్ని వీలయినంత మేర అడ్డుకునే క్రమంలో తనదైన శైలిలో చక్రం తిప్పాలని అడ్డంగా బుక్కైపోయిన రవిప్రకాశ్ ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. రోజుల తరబడి విచారణ సాగుతున్నా... రవిప్రకాశ్ పోలీసులకు సహకరించడం లేదట. అయితే నిజాలను రాబట్టడంలో పోలీసులు అంత వీజీగా రవిప్రకాశ్ ను వదిలేయరు కదా. ఈ క్రమంలో విచారణలో భాగంగా రవిప్రకాశ్ ఎంతగా సతాయిస్తున్నా కూడా పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ రవిప్రకాశ్ కు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారట.

మొన్నటిదాకా అడ్రెస్ లేకుండా పోయి... చివరకు పోెలీసుల ఎదుట హాజరుకాక తప్పదని తెలుసుకున్న రవిప్రకాశ్ బుద్ధిగా పోలీసుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తనదైన జర్నలిస్ట్ బుద్ధిని బయటపెట్టుకున్న రవిప్రకాశ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలే ఇవ్వడం లేదట. అయితే నిజాలు చెప్పేదాకా విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పిన పోలీసులు ఇప్పటికే నాలుగు రోజుల విచారణకు వచ్చినా... రేపు కూడా వరుసగా ఐదో రోజు కూడా విచారణకు రావాల్సిందేనని రవిప్రకాశ్ కు అల్టిమేటం జారీ చేశారట. నాలుగో రోజైన శుక్రవారం నాటి విచారణలో భాగంగా రవిప్రకాశ్ బాగానే ఇబ్బంది పడ్డాడట.

నోటితో నిజాలు చెప్పేందుకు రవిప్రకాశ్ నిరాకరిస్తుండగా - ఓ పెన్ను - పేపర్ ఇచ్చిన పోలీసులు దానిపై రవిప్రకాశ్ చేత పలు వాక్యాలు రాయించి ఆయన మానసిక స్థితిని తెలుసుకునే యత్నం చేశారట. అంతేకాకుండా ఫోర్జరీ సంతకాలు - యాజమాన్యానికి తెలియకుండా లోగోల విక్రయాలకు సంబంధించి రవిప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు - ఆ సందర్బంగా ఆయన రాతలను తాజా చేతిరాతతో పోల్చి చూశారట. ఇలా ఓ కరడుగట్టిన నేరస్థుడిని విచారించిన వైనంగా పోలీసులు పెన్ను, పేపర్ ముందుపెట్టగానే రవిప్రకాశ్ డంగైపోయినట్టుగా సమాచారం. శనివారం కూడా ఇదే తరహాలో పోలీసులు రవిప్రకాశ్ కు చుక్కలు చూపేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం. మరి ఈ తరహా విచారణలో అయినా రవిప్రకాశ్ నిజాలు కక్కుతారో - లేదో చూడాలి.