Begin typing your search above and press return to search.
గులాబీ ఎంపీ ఇంటిని దోచేశారట
By: Tupaki Desk | 7 April 2018 10:55 AM GMTఅవును.. గులాబీ ఎంపీ ఇంటిని దోచేశారు దొంగలు. విన్నంతనే అవాక్కు అయ్యే ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో కాదు.. విద్యార్థి నాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ తరఫున కోట్లాడిన బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థి నాయకులు పాల్గొన్నా.. బాల్క సుమన్ కు తిరిగిన సుడి మరెవరికీ తిరగలేదని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. టీఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేయటం ద్వారా.. ఎంపీగా ఎన్నికైన బాల్క సుమన్ కు ఫైర్ బ్రాండ్ నేతన్న పేరుంది. ఆయన నోటికి రాజకీయ ప్రత్యర్థులు భయపడుతుంటారు. కానీ.. దొంగలు మాత్రం లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
పెద్దపల్లి ఎంపీగా వ్యవహరిస్తున్న బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇల్లుంది. ఆయన ఇంటితో పాటు.. మరో మూడు ఇళ్లల్లో దొంగలు స్వైర విహారం చేశారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఒక ఇంట్లో దాదాపు లక్ష రూపాయిల వరకూ చోరీ చేసినట్లు లెక్కలు తేలాయి. ఎంపీ సుమన్ తో పాటు.. మిగిలిన ఇళ్లల్లో యజమానులు లేకపోవటంతో దోపిడీకి గురైంది ఎంతన్నది లెక్క తేల్లేదు.
ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని అధికారపార్టీ ఎంపీకి తెలియజేశామని.. ఆయన వచ్చాక ఎంత సొత్తు చోరీకి గురైన విషయం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అధికారపార్టీ ఎంపీ ఇంటికే చోరీ చేసే పరిస్థితి ఉందంటే.. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందన్న మాట స్థానికుల నోట వినిపిస్తోంది. దొంగలు సులువుగా టార్గెట్ చేసేలా ఎంపీ ఇల్లు ఉందా? కనీస రక్షణ ఉండదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.