Begin typing your search above and press return to search.

జ‌య‌రాం మ‌ర్డ‌ర్‌...సీఐపై వేటు...వాళ్ల‌పై విచార‌ణ‌

By:  Tupaki Desk   |   17 Feb 2019 4:00 AM GMT
జ‌య‌రాం మ‌ర్డ‌ర్‌...సీఐపై వేటు...వాళ్ల‌పై విచార‌ణ‌
X
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మూడు రోజుల్లో కొన్ని కీలక విషయాలు రాబట్టిన పోలీసులు.. ఇక ఈ వారం రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి తెస్తారని భావిస్తున్నారు. అయితే, జయరాం హత్య కేసులో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీ చేస్తూ పోలీస్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బంజారాహిల్స్ ఏసీపీ టీమ్...ఇప్పటికే కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు ప్రధాన నిందితుడైన రాకేష్‌ రెడ్డి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. మరింత లోతైన దర్యాప్తు కోసం రాకేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ ను మరో ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... జయరాం హత్య కేసులో నిందితులైన రాకేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కు ఈ నెల 23వ వరకు పోలీసు కస్టడీ పొడిగించింది. మరోవైపు నిన్నటితో నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో... ఇవాళ ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంరతం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

ఇదిలాఉండ‌గా, జయరాంను హత్య చేశాక రాకేష్‌ రెడ్డి మొదట కాల్‌ చేసింది రాయదుర్గం సీఐ రాంబాబుకేనని పోలీసులు గుర్తించారు. ఫోన్‌ చేసిన తర్వాత కూడా నిందితుడిని పట్టుకోవడంలో విఫలమైనందుకు రాంబాబుపై వేటు వేసింది. ఇప్పటి వరకు జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడింది. మరోవైపు.. రాకేష్‌ తో టచ్‌ లో ఉన్న సీఐ శ్రీనివాస్‌, ఏసీపీ మల్లారెడ్డిలను సోమవారం విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. జయరాం హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు వీరు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పోలీసుల‌ను ద‌ర్యాప్తు చేసిన త‌ర్వాత మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది.