Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలకు షాక్... ఇళ్లకు నోటీసులంటించిన పోలీసులు
By: Tupaki Desk | 19 Jan 2020 1:18 PM GMTపరిపాలన వికేంద్రీకరణ - మూడు రాజదానుల ఏర్పాటు అమరావతిలో ప్రకంపనలకు కారణం అవుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ విపక్షాలు - అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ - అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో నేతలకు సెక్షన్ 149 కింద నోటీసులిచ్చారు. టీడీపీ నేతల ఇళ్ల తలుపులకు నోటీసులు అంటించారు.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండటం... టీడీపీ - సీపీఐ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాజధానిలో ఉత్కంఠ రేకెత్తించేలా పరిస్థితులు మారిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వర్రావు - వర్ల రామయ్య - బుద్ధా వెంకన్నతో పాటు పలువురు నేతలకు నోటీసులిచ్చారు. రేపటి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. కాగా, పోలీసుల తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారని.. తనను నిరంతరం ఫాలో అవుతున్నారని ఆరోపించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్ వెళ్లేందుకు సీఎం నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇంటి నుంచి సచివాలయం వెళ్లే దారిలోని కీలకమైన పాయింట్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్ పోస్టులను పెట్టారు.