Begin typing your search above and press return to search.
ఈ వలస వెతలకు చరమగీతం ఎప్పుడు?
By: Tupaki Desk | 16 May 2020 10:30 AM GMTఉపాధినిచ్చిన ఊరు పనిలేక పొమ్మంది. కన్నఊరికి వెళదామంటే పోవనీయడం లేదు. వలస కూలీల్లో రోజురోజుకు ఆశ చచ్చిపోతోంది. ఇక్కడే ఉంటే చచ్చిపోతామా అని వారు సొంతూళ్లకు వెళ్లడానికి ఎలాగైనా ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి శిబిరాలకు పయనమవుతున్నారు. వలస కూలీల బతుకులు ఎంత దుర్భరమో తాజా సంఘటన చాటిచెప్పింది.
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి.. శిబిరాల్లో తలదాచుకుంటూ కన్నవారిని తలుచుకుంటూ కుమిలిపోతున్న వలస కార్మికులపై పోలీస్ లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు లాఠీల దెబ్బకు వలస కార్మికులు హడలిపోయారు. భయంతో పరుగులు తీసిన దైన్యం కనిపించింది.
విజయవాడ క్లబ్ లో యూపీ - ఒడిశా - మధ్యప్రదేశ్ - ఝర్ఖండ్ - శ్రీకాకుళం - విజయనగరం కూలీలకు వసతి కల్పించారు. అయితే ఈ ఉదయం 150మంది సైకిళ్లు తీసుకొని బయలు దేరారు. వాళ్లు తాడేపల్లి వద్దకు రాగానే పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో భయంతో పరుగులు తీస్తూ మళ్లీ విజయవాడ క్లబ్ కు చేరుకున్నారు.
ఇలా పోదామంటే పోలీసులు లాఠీలతో కొడుతూ.. ఉందామంటే కన్నవారికి దూరంగా రెండు నెలలుగా వలస కార్మికులు నరకం అనుభవిస్తున్నారు . ప్రభుత్వాలు రైళ్ల ద్వారా కూలీలను పంపించమని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టిసారించడం లేదు. దీంతో తమ ప్రాంతాలకు వలసకూలీలు పోలేక.. ఇక్కడ ఉండలేక నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా ఆ వలస బతుకులకు ప్రభుత్వాలు విముక్తి కల్పించి వారిని వాళ్ల సొంతూళ్లకు పంపించాలి. అప్పుడే ఈ వలస వెతలకు చరమగీతం పాడవచ్చు.