Begin typing your search above and press return to search.

షేర్ చేసేవాళ్లకు ఇదో హెచ్చరిక

By:  Tupaki Desk   |   20 Oct 2019 6:39 AM GMT
షేర్ చేసేవాళ్లకు ఇదో హెచ్చరిక
X
దేశంలో జియో రంగ ప్రవేశంతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. డేటా వినియోగం బాగా పెరిగింది. అన్ లిమిటెడ్ డేటా రావడంతో మనవాళ్లు దగ్గినా, తుమ్మినా కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అలజడులు, అల్లర్లు సృష్టించేలా కొందరు ఆకతాయిలు పోస్టులు పెడుతున్నారు. వాటిని షేర్ చేస్తూ సాధారణ పౌరులు కూడా ఇప్పుడు కటకటాల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ కావాలని షేర్ చేసిన వారంతా ఇప్పుడు బుక్కైపోతున్నారు. జైలు పాలవుతున్నారు. ఎవరో కసితో, కోపంతో పగతో సృష్టించిన పోస్టులను మీరు అత్యుత్సాహంతో షేర్ చేశారో జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే..

తాజాగా రెచ్చగొట్టే పోస్టులు - తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. హైదరాబాద్ లో వరుసగా ఒక మీడియాపై, మహిళా పోలీస్ బాస్ లపై తప్పుడు వార్తలు సృష్టించిన వారిని జైలుకు పంపారు. ప్రతీ పోస్టుపైన సైబర్ పోలీసులు నిఘా ఉంచుతున్నట్టు తెలిసింది. అభ్యంతరకర పోస్టులపై కామెంట్, షేర్లు చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముఖ్యంగా ఫేస్ బుక్ - వాట్సాప్ - ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్నింటిపైనా పోలీసుల నిఘా నడుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వార్తలను నిర్ధారించుకుండా షేర్ చేశారో బుక్కైపోతారు. ఇతరులను రెచ్చగొట్టేలా, కొన్ని వర్గాలను కించపరిచేలా, వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతీసే పోస్టులపై ఇప్పుడు పోలీసులు నిఘా పెడుతూ వారిపై చర్యలకు దిగుతున్నారు. సో నెటిజన్లు తస్మాత్ జాగ్రత్త...