Begin typing your search above and press return to search.
టీడీపీ ఫైర్ బ్రాండ్‌కు పోలీసుల నోటీసులు!
By: Tupaki Desk | 7 Sep 2022 7:32 AM GMTఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరఫున గట్టిగా గళమెత్తేవారిలో ఉండవల్లి అనూష ఒకరు. సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్సీపీపైన, జగన్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. తద్వారా టీడీపీ సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్‌గా అనూష పేరు తెచ్చుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు లేదా పోస్టులు చేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని ఉండవల్లి అనూషపై అభియోగం.
ప్రస్తుతం ఐ-టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఉండవల్లి అనూష. అలాగే ఆమెకు ఏలూరులోని ఆర్ఆర్ పేటలో వస్త్ర దుకాణం ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరులోని ఆమె బట్టల షాపుకు వచ్చిన పోలీసులు అనూషకు 41ఏ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిపై స్పందించిన అనూష.. పోలీసులు తనకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న సోషల్ మీడియా ఖాతాలు తనవి కాదన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని మండిపడ్డారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు.
కాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శింగనమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను, సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.