Begin typing your search above and press return to search.

8 నెల‌ల గ‌ర్భిణి మ‌ర్డ‌ర్ ఎంత పైశాచికమంటే..?

By:  Tupaki Desk   |   1 Feb 2018 4:53 AM GMT
8 నెల‌ల గ‌ర్భిణి మ‌ర్డ‌ర్ ఎంత పైశాచికమంటే..?
X
విన్నంత‌నే ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేయ‌ట‌మే కాదు.. ఎంత‌కూ న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో చేసిన దారుణ హత్య సామాన్యుల కంటే పోలీసు వ‌ర్గాల్ని షాకింగ్ కు గురి చేస్తోంది. హైద‌రాబాద్ లోని బొటానిక‌ల్ గార్డెన్ రోడ్డు మీద 8 నెల‌ల గ‌ర్భిణిని దారుణంగా హ‌త్య చేయ‌ట‌మే కాదు.. ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసి రోడ్డు మీద వ‌దిలివెళ్ల‌టం తెలిసిందే.

ఈ ఉదంతం పోలీసు వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే..ఈ మ‌ర్డ‌ర్ పోస్ట్ మార్ట‌మ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలే ఇందుకు కార‌ణం. మ‌నిషి అన్నోడు అస‌లిలా చేస్తాడా? అన్న సందేహం క‌లిగేలా ఈ మ‌ర్డ‌ర్ వ్య‌వ‌హారం ఉంద‌ని చెప్పాలి. పోస్టుమార్ట‌మ్ రిపోర్ట్ ప్ర‌కారం.. 8 నెల‌ల గ‌ర్భిణికి సంబంధించి ఒంట్లోని ఎముక‌ల‌న్నీ విరిగిపోయిన‌ట్లుగా తేలింది.

అంటే.. అంత చిత్ర‌వ‌ధ చేసిన త‌ర్వాతే ఆమెను హ‌త్య చేసిన‌ట్లుగా తేలింది. అంతేకాదు.. ఆమెను హ‌త్య చేసిన నిందితుడు.. ఆమెతో పాటు ఆమె గ‌ర్భంలో పెరుగుతున్న శిశువు విష‌యంలోనూ అత్యంత క్రూరంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెబుతున్నారు.

హ‌త్య‌కు గురైన మ‌హిళ‌తో పాటు.. ఆమె గ‌ర్భంలోని శిశువు (మ‌గ శిశువుగా నిర్దారించారు) ఎముక‌ల‌న్నీ ముక్క‌లు ముక్క‌లైన‌ట్లుగా గుర్తించారు. ఇంత అమాన‌వీయంగా.. ఇంత దారుణంగా హ‌త్య చేయ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. నిత్యం దారుణ హ‌త్య‌లు.. నేరాలు చూసే పోలీసులు సైతం 8 నెల‌ల గ‌ర్భిణిని హ‌త్యకు గురైన విధానాన్ని పోస్ట్ మార్ట‌మ్ నివేదిక చ‌దువుతూ త‌ల్ల‌డిల్లిపోతున్నారు.

ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌ట‌మే కాదు.. ఎట్టి ప‌రిస్థితుల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పోలీసులు ఉన్నారు. ఎలాంటి క్లూ ల‌భించ‌ని ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా ఎనిమిదికి పైగా బృందాల్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బాధిత మ‌హిళ క‌చ్ఛితంగా సైబ‌రాబాద్ ప‌రిధికి చెంది ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే.. నిందుతుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.ల‌క్ష బ‌హుమానం ఇస్తామ‌ని హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌క‌టించారు.