Begin typing your search above and press return to search.
టీ పోలీస్ శాఖలో 'నయిం' రచ్చ
By: Tupaki Desk | 3 Jan 2017 5:01 AM GMTసంచలనం సృష్టించిన నయిం ఎన్ కౌంటర్ కు సంబంధించి తెలంగాణ పోలీసులు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త చిచ్చు పెట్టిందన్న వాదన వినిపిస్తోంది. నయిం కేసులో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారటమే కాదు.. పోలీసు ఉన్నతాధికారులకు.. హోంశాఖ అధికారులకు మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. ఇరువురి మధ్య కొత్త చిచ్చు పెట్టింది.
నయింతో రాజకీయ నేతలకు.. పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధాలు లేవంటూ కొద్దిరోజుల క్రితం దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు కొందరు తీవ్రమైన అసంతృప్తిని.. అసహనాన్ని వ్యక్తం చేయటమే కాదు.. హోంశాఖపై చిందులు తొక్కుతున్నారు. వాస్తవానికి తమకు తెలీకుండానే హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసిందని.. కేవలం సంతకాల కోసం మాత్రమే ఈ అఫిడవిట్ వచ్చిందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.
నయిం కేసును విచారిస్తున్న అధికారులు సైతం.. నయింపై దాఖలు చేసిన ప్రభుత్వ పిటీషన్ ఏమాత్రం సబబు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఫిడవిట్ కు సంబంధించిన కనీస సమాచారం కూడా తమకు లేదని.. మీడియాలోకి వచ్చిన తర్వాత మాత్రమే విషయం తెలిసిందని వాపోతున్నారు. నయిం ఎన్ కౌంటర్ అనంతరం.. అతడితో కొందరు రాజకీయ నేతలకు.. పోలీసు ఉన్నతాధికారులకు మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. ఈ పరిణామం విపక్ష నేతల మెడకు చుట్టుకుంటుందని భావించినా.. అధికారపక్ష నేతలకూ భాగస్వామ్యం ఉందన్న వాదన వినిపించింది.
ఇలాంటి వేళ.. దర్యాప్తు బృందం దాఖలు చేసే అఫిడవిట్ లో కీలక అంశాలు వెలువడతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి భిన్నంగా.. తెలంగాణ హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ ఉండటం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. నయిం కేసుకు సంబంధించి హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు.. దర్యాఫ్తు అధికారులకు సైతం షాక్ తినేలా చేసిందన్న మాట ఉంది. అఫిడవిట్ ను దాఖలు చేసే సమయంలో కనీస సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు సైతం అందించలేదని.. ఇందులోని అంశాల నేపథ్యంలో వారు హోంశాఖ అదికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఏమైనా.. నయిం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్ హోంశాఖ.. పోలీస్ ఉన్నతాధికారుల మధ్య దూరాన్ని పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/