Begin typing your search above and press return to search.
టీడీపీ ఓటమికి పోలీసులదే బాధ్యత ... బాబు పై పోలీసు అధికారుల సంఘం ఫైర్ !
By: Tupaki Desk | 5 March 2021 2:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. డీజీపీ పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకోగలమని, అయితే, ఎన్నికల్లో ఓటమికి పోలీసు శాఖదే బాధ్యత అనడం భావ్యమేనా అని ప్రశ్నించింది. పోలీసులు అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీసులకు మంటపుట్టించాయి. దీంతో వారు ఇవాళ చంద్రబాబు కామెంట్స్ ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఇందులో సంఘం నేతలు పోలీసులను, డీజీపీని బెదిరించి కుల, ప్రాంతీయ భావాలు రేకెత్తించి మా ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు డీజీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు. డీజీపీపై చేసిన ఆరోపణలను తాము చంద్రబాబు వ్యక్తిత్వానికి ప్రతీకలుగానే భావిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.
గౌతమ్ సవాంగ్ గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారని, అప్పుడు ఆయన కులం, మతం గుర్తుకురాలేదా, అని ప్రశ్నించారు. 35 ఏళ్లుగా ఐపీఎస్ అధికారిగా ప్రజలకు సేవలు అందిస్తున్న సవాంగ్ పై చంద్రబాబు ఈ విధంగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. ఈ వ్యాఖ్యలను అనైతికమని తాము భావిస్తున్నామని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.