Begin typing your search above and press return to search.

కేఈ కృష్ణమూర్తి కొడుకు కనిపించడం లేదంట

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:39 AM GMT
కేఈ కృష్ణమూర్తి కొడుకు కనిపించడం లేదంట
X
ఈ ఏడాది మే నెలలో జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య మీకు గుర్తుండే ఉంటుంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్నఆయన్ను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో ప్రధానంగా వినిపించిన పేర్లు పత్తికొండ ఎమ్మెల్యే - డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్లవే. ఎందుకంటే కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు అక్రమ మైనింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నాడని నారాయణ రెడ్డి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఆ రీచ్ ను మూసివేయమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఒక పెళ్లికి వెళ్లి వస్తున్న నారాయణ రెడ్డిని సినీ ఫక్కీలో రో్డ్డుకు అడ్డంగా తూములు పెట్టి - బాంబులు విసిరి వాహనాలతో చుట్టుముట్టి పాశవికంగా నరికి చంపారు. అయితే ఏదైనా హత్య జరిగితే హడావుడి చేసే పోలీసులు.. ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టిన పాపాన పోలేదు. ప్రధాన నిందితుడు కేఈ శ్యాంబాబును అరెస్ట్‌ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేత - డిప్యూటీ సీఎం కుమారుడు కావడమే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

నారాయణ రెడ్డి హత్య జరిగి వంద రోజులవుతున్నా.. ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుండడం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు వస్తున్నాయి. శ్యాంబాబు ఎక్కడో ఉన్నారో తమకు తెలియదని - ఆయన ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతుండటం నమ్మశక్యంగా లేదు. ఇప్పటికైనా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు ఉన్నతాధికారులు పని చేయాలని నారాయణరెడ్డి కుటుంబీకులు కోరుతున్నారు.