Begin typing your search above and press return to search.
మీ రాజ్యంలో ఇలాంటివేంటి బాబు?
By: Tupaki Desk | 5 Nov 2015 6:51 AM GMTకొన్ని విషయాలకు మీడియాలో లభించే ప్రాధాన్యత.. మరికొన్ని విషయాలకు అసలు లభించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఏపీ రాజధానికి సంబంధించి కొన్ని అంశాలు వార్తలుగా రావటం లేదని వాపోతున్నారు. భూములకు సంబంధించిన జరుగుతున్న వ్యవహారాల్లో పోలీసులు ప్రదర్శిస్తున్న అతి ఒక్కోసారి హద్దులు దాటుతోందన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఆలస్యంగా బయటకొచ్చిన ఒక ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఆ మధ్యన చెరుకు తోట దగ్దమైంది. మల్కాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో చంద్రశేఖర్ అనే రైతు పొలంలో ఇది చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య మాటల మంటలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. దగ్థమైన పొలంలో చెరుకు పంటను తాను తగలబెట్టినట్లుగా చంద్రశేఖర్ మేనల్లుడి చేత బలవంతంగా ఒప్పించినట్లు చెబుతున్నారు.
అతగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారం రోజులుగా తమ అదుపులోనే ఉంచుకున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించి.. అక్కడ నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాకే పోలీసులు విడిచి పెట్టారని చెబుతున్నారు. ఒక వ్యక్తి నేరం చేశాడో.. లేదో అన్న సంగతి తేలకుండా పోలీసులు ఇలా అదుపులోకి తీసుకోవటం ఏమిటన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని భారీగా హింసించి నేరాన్ని చేసినట్లుగా ఒప్పించినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అంశాలు ప్రభుత్వ పరపతిపై దుష్ప్రభావం చూపించటం ఖాయం. ఇలాంటి వాటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. అమాయకులు అనవసరమైన వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అయినా.. చంద్రబాబు రాజ్యంలో ఇలాంటివి చోటు చేసుకోవటం ఏమిటి?