Begin typing your search above and press return to search.
పోలీసు సేవలు విజయవాడ నుంచే
By: Tupaki Desk | 18 July 2015 11:48 AM GMTనవ్యాంధ్రలో పోలీసు సేవలు ఇక విజయవాడ నుంచే ప్రారంభం కానున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే డీజీపీ నివాస భవనం పూర్తిస్థాయిలో సిద్ధం కాగా.. ఇప్పుడు ఆఫీసు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలోనే డీజీపీ కార్యాలయ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సీఎం క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ లో డీజీపీ క్యాంపు, నివాస భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా విజయవాడలో ముఖ్యమంత్రి తరచూ పర్యటిస్తుండడం.. వారానికి నాలుగు రోజులు ఇక అక్కడే ఉంటానని స్పష్టం చేయడం.. ఇక్కడి నుంచే వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతుండడంతో విజయవాడలో సీఎం భద్రత ముఖ్యమైంది. దాంతో డీజీపీ క్యాంపు, కార్యాలయ భవనాలను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించారు.
డీజీపీ కార్యాలయానికి ఇప్పటి నుంచే పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దానిచుట్టూ పది అడుగుల ఎత్తున ప్రహరీ నిర్మిస్తున్నారు. దీనికి అదనపు హంగులన్నీ పూర్తయ్యాయి. ఇప్పడు తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్నీ అనుకున్నట్లు సాగితే పుష్కరాలు అయిన వెంటనే మరొక వారం రోజుల్లో పోలీసు కార్యాలయ కార్యకలాపాలు విజయవాడ నుంచే ప్రారంభం కానున్నాయి.