Begin typing your search above and press return to search.

బయటకి వచ్చినందుకు..పోలీసులు వీరికి ఇస్తున్న పనిష్మెంట్ చూడండి

By:  Tupaki Desk   |   25 March 2020 12:30 AM GMT
బయటకి వచ్చినందుకు..పోలీసులు వీరికి ఇస్తున్న పనిష్మెంట్ చూడండి
X
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరింత వేగంగా వ్యాప్తిచెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  సోమవారం మరోసారి హెచ్చరించింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ కరోనా కారణంగా  16,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  మన దేశంలోని అన్నిరాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ను ప్రకటించాయి. రైళ్లు - బస్సులు - విమానాలు  ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా - గొప్ప - ఆడా - మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి.

కరోనా నివారణకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని పట్టించుకోకుండా.. నిబంధనలు గాలికి వదిలేసి.. అనేకమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. వాహన దారులు దూసుకుపోతున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడంలేదు. రూల్స్ బ్రేక్ చేసిన వారిని శిక్షించాలని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి.. కరోనా వైరస్ మహమ్మారిని పెడ చెవిన పెట్టినందుకు అమెరికా - ఇటలీ - స్పెయిన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఒక సైడ్ అది చేస్తున్నప్పటికీ కూడా  భారత్ లో మాత్రం లాక్ డౌన్ నీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.

దీనితో ఇంటి నుండి బయటికి వస్తున్న వాహనదారులకు పోలీసులు తగిన బుద్ది చెబుతున్నారు. షాద్ నగర్ లో బయటికి వచ్చిన వాహనదారులను గుంజిళ్ళు తీయించారు పోలీసులు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా పోలీసులు వాహనదారుల కు బుద్ది చెబుతున్నారు. కొన్ని చోట బయటకి వచ్చిన వారితో కరోనా పై ఇతరులకి అవగాహన కల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్డు పై పాకిస్తున్నారు. మొత్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో బయటకి వచ్చిన ప్రజలకి  ప్రస్తుతం పోలీసులు  వేసిన శిక్షలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.