Begin typing your search above and press return to search.
రోహిత్ హత్యలో భార్య పాత్రపై కొత్త అనుమానాలు?
By: Tupaki Desk | 21 April 2019 5:14 AM GMTఉమ్మడి ఏపీ రాష్ట్ర గవర్నర్ గా.. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మరణం పెను సంచలనాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన రోహిత్ చిన్న వయసులో మరణించటం.. తొలుత దాన్ని సహజ మరణంగా భావించినా.. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనది హత్యగా అనుమానించటం తెలిసిందే.
అనారోగ్యంతో మరణించినట్లు ప్రచారం జరిగినా.. ఊపిరి ఆడగ ఆయన మరణించిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా ఆయనది హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. రోహిత్ హత్య వెనుక ఆయన సతీమణి అపూర్వ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు.
అస్వస్థతకు గురైన రోహిత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లింది ఆయన సతీమణి అపూర్వే. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఆయన హత్యకు గురయ్యారంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్ వైవాహిక జీవితం సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. దంపతులిద్దరి మధ్య మొదట్నించి గొడవలు ఉన్నట్లు రోహిత్ తల్లి చెబుతోంది. వారిద్దరూ తరచూ గొడవ పడేవారంటున్నారు.
రాజకీయంగా తాను ఎదగలేకపోతున్నానన్న కుంగుబాటు తన కుమారుడిలో కనిపించేదన్న తల్లి ఉజ్వల..రోహిత్ మరణానికి ముందు చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేసుకున్న తన కొడుకు మరణానికి ముందురోజు తాను ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో రోహిత్ నిద్ర పోతున్నట్లుగా సమాధానం వచ్చిందని.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫోన్ చేసినా నిద్ర పోతున్నట్లుగా చెప్పారన్నారు. సాయంత్రం నాలుగు గంటల వేళ ఎందుకు నిద్ర పోతారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి పడుకొని ఉన్నా.. సాయంత్రం నాలుగు గంటలకు లేవకుంటే ఎందుకు లేపలేదంటూ రోహిత్ తల్లి ప్రశ్నిస్తున్న ప్రశ్న కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. మరణించిన రోజు సాయంత్రం నాలుగు గంటల వేళలో రోహిత్ ఇంటి పని మనిషి ఫోన్ చేశారని.. తన కొడుకు రక్తం కక్కుకొని అపాయకర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారని ఉజ్వల చెబుతున్నారు. తాను వెంటనే అంబులెన్స్ తీసుకొని వెళ్లేసరికి.. అతన్ని కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తన కోడల మాటల్ని తాను పూర్తిగా నమ్మినట్లుగా ఆమె చెబుతున్నారు. హత్య అని పోలీసులు తేల్చిన నేపథ్యంలో.. రోహిత్ తల్లి తన కోడల మీద అనుమానం పెరిగేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.