Begin typing your search above and press return to search.
బెంజ్ కు మన పోలీసుల క్వశ్చన్స్!
By: Tupaki Desk | 13 May 2017 4:54 AM GMTరోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ప్రాథమికంగా సీసీ కెమేరాల ఫుటేజ్ లభించినా.. పలు సందేహాలు మన పోలీసులకు పట్టి పీడిస్తున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న ఈ అత్యాధునిక వాహనంలో.. ఏ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ చినిగిపోతాయి? అన్న సందేహం పోలీసులకు వచ్చింది.
ఇదొక్కటే కాదు.. ఇదే తరహాలో దాదాపు ఆరుకు పైగా ప్రశ్నలు వారికి వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. సాంకేతికంగా తమకున్న సందేహాల్ని లేఖ రూపంలో మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యానికి పోలీసులు పంపారు. నిషిత్ వాడిన బెంజ్ కారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. జి-63 మోడల్ కు చెందిన ఈ కారు విలువ తక్కువలో తక్కువ రూ.2.10కోట్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా.
ప్రపంచ ప్రఖ్యాత వాహన సంస్థ అయిన బెంజ్ కు దేశంలో మహారాష్ట్రలోని ఫుణేలో ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి తమకున్న సందేహాల చిట్టాను పంపినట్లుగా చెబుతున్నారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఎయిర్ బాగ్స్ తెరుచుకుంటాయి? నిషిత్ కారులో ఎయిర్ బాగ్స్ ఎందుకు పగిలిపోయాయి? సీటు బెల్ట్ పెట్టుకోకున్నా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయా? ఎంత స్పీడ్ లో ఉంటే ఎయిర్ బాగ్స్ తెరుచుకుంటాయి? స‌్పీడ్ మీటర్ ను ఎంత మేర లాక్ చేసే వీలుంది? ఇలాంటి పలు ప్రశ్రల్ని బెంజ్ యాజమాన్యానికి మన పోలీసులు లేఖ రూపంలో సంధించినట్లుగా తెలుస్తోంది.. మరి.. దీనిపై బెంజ్ యాజమాన్యంం ఎలాంటి సమాధానాలు ఇస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/