Begin typing your search above and press return to search.
కూకట్ పల్లిలో దొరికిన టీడీపీ డబ్బుల కట్టలు
By: Tupaki Desk | 6 Dec 2018 4:36 AM GMT‘పచ్చ’ బ్యాచ్ ప్రలోభాలకు తెరలేపింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో కట్టల పాములు బయటకు తీస్తోంది. కోట్లాది రూపాయలను రాత్రి వేళల్లో పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారమే కాదు.. తమ అభ్యర్థులను గెలిపించేందుకు వందల కోట్లు వెదజల్లుతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దానికి బలం చేకూరేలా తాజాగా ఏపీ టీడీపీ నేత.. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న జూపూడి ప్రభాకర్ రావు ఇంటి వద్ద బుధవారం రాత్రి డబ్బు సంచులు బయటపడ్డాయి. ముగ్గురు వ్యక్తులు డబ్బుల సంచులతో జూపూడి ఇంటివెనుక నుంచి వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిలో ఇద్దరు డబ్బుల సంచులతో పారిపోగా.. ఒక వ్యక్తి మాత్రం దొరికాడు.
జూపూడి ఇంటి వద్ద దొరికిన డబ్బు సంచిలో రూ.17 లక్షలు బయటపడడం కలకలం రేపింది. డబ్బుతో దొరికిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లిలో టీడీపీకి సపోర్టుగా డబ్బు సరఫరా చేస్తున్న జూపూడిని అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు రాత్రి అక్కడే ధర్నాకు దిగారు.
కూకట్ పల్లిలో టీడీపీ తరుఫున నందమూరి సుహాసినిని చంద్రబాబు నిలబెట్టారు. ఈ సీటును ఎలాగైనా గెలిపించేందుకు స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, బాలయ్య సహా హేమాహేమీలందరూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కూకట్ పల్లిలో ఉండే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంటి నుంచి డబ్బులు పంచేందుకు ప్రయత్నించి పచ్చ బ్యాచ్ అడ్డంగా దొరకడంతో టీడీపీ, చంద్రబాబుల బండారం బయటపడినట్టైంది. మరి నీతి నీజాయితీతో ఓటేయాలని కోరిన బాబు ఇలా కూకట్ పల్లిలో అడ్డదారులు తొక్కడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇక వరంగల్ జిల్లా కాజిపేటలో కూడా గోపాల్ రావు అనే వ్యక్తి ఇంట్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రెండు కోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇవి మహాకూటమి తరుఫున వర్ధన్నపేటలో నిలబడ్డ పగిడిపాటి దేవయ్యకు చెందిన రెండు కోట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వేల కోట్లను తెలంగాణపై వెదజల్లుతోందని అర్థమవుతోంది.