Begin typing your search above and press return to search.
17 ఏళ్ల అమ్మాయి పై 'ఖాకి' అత్యాచారం ... వత్తాసు పలికిన తల్లిదండ్రులు !
By: Tupaki Desk | 10 Jan 2020 5:58 AM GMTఈ సమాజంలో మార్పు వస్తుంది అని అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది. నిర్భయ , దిశ లాంటి ఎందరో అమ్మాయిలు కామాంధుల చేతుల్లో చిక్కి బలైపోతున్నారు. అలాగే అలాంటి కామాంధుల చేతుల్లో నుండి అమాయకమైన ఆడపిల్లని కాపాడాల్సిన పోలీసులు కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడితే అమ్మాయిలకి రక్షణగా నిలిచేది ఎవరు ? తాజాగా మహారాష్ట్ర లో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. 17 అమ్మాయిని నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలని భరించ లేని ఆ అమ్మాయి ఇంట్లో నుండి వెళ్లిపోవడం తో , తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆ తరువాత ఈ కేసు పై విచారణ ప్రారంభించిన పోలీసులకి కీచక పోలీస్ అసలు బండారం బయటపడింది.
పూర్తి వివరాలు చూస్తే ... పుణేలో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డీటీసీ గా పనిచేస్తున్న నిషికాంత్ మోరె తనకు బాగా పరిచయం ఉన్న ఓ కుటుంబానికి చెందిన అమ్మాయిపై కొద్దిరోజులగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. తాను ఐపీఎస్ అధికారినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. దీనితో కొన్ని రోజులు అతని చేష్టలు మౌనంగా భరించింది. కానీ , ఇక అతని దురాగతాన్ని భరించలేక ఆ బాలిక గత నెల 27వ తేదీన తలోజా పోలీస్ స్టేషన్ లో ఈ పోలీస్ బాస్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మోరే పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాధితురాలిపై బెదిరింపులు తీవ్రం అయ్యాయి. కుటుంబ సభ్యులపై ద్వారా కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. కొద్ది రోజులుగా తల్లిదండ్రులు సైతం అతనికే వత్తాసు పలికారు. ఈ నేపథ్యం లో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ లేఖ రాసి సోమవారం ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.
దీనితో బాధితురాలి తల్లిదండ్రులు తలోజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం నాటి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. బాధితురాలు ఓ లగేజీ బ్యాగ్‌ను తీసుకుని ఒంటరిగా అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లి పోవడం కనిపించింది. బాధితురాలి కోసం ప్రస్తుతం తలోజా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికపై అత్యాచారం, అదృశ్యం కావడానికి ప్రధాన కారణం నిషికాంత్ మోరే కావడం.. అతని ఒత్తిళ్ల వల్లే బాలిక కనిపించకుండా పోయిందంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన నిషికాంత్ మోరేను పోలీసులు అరెస్టు చేశారు. బెెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటీషన్‌ను పన్వెల్ న్యాయస్థానం కొట్టి పారేసింది. అత్యాచారాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. శిక్షను అనుభవించక తప్పదని తెలిపింది. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.