Begin typing your search above and press return to search.
మోడీపై గెలిచిన పందెం కోడి..!
By: Tupaki Desk | 20 Dec 2016 10:51 AM GMTపెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనాన్ని ఎంతవరకూ అరికట్టగలిగారో తెలీదుగానీ... కోడి పందేలు మాత్రం ఆగేట్టు లేవు! సంక్రాంతి వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతాయన్న సంగతి తెలిసిందే. ఆ వారం రోజులూ కొన్ని వందల కోట్లు చేతులు మారతాయని అంచనా. పందేలను అడ్డుకోవాలని ప్రతీయేటా పోలీసులు హడావుడి చేసినా.. పండుగ నాలుగు రోజులూ మాత్రం అంతా ఓపెన్‌గానే జరుగుతూ ఉంటాయి. అయితే, కేంద్రం ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఈ ఏడాది కోడిపందేలు తగ్గుతాయని అనుకున్నారు. ప్రజల దగ్గర ల్విక్విడ్ క్యాష్ తక్కువగా ఉంది కాబట్టి, బెట్టింగులకు ఆస్కారం ఉండదనీ, గతంలో మాదిరిగా ఈ ఏడాది అలాంటి హడావుడి కనిపించదని అంచనా వేశారు. అయితే, వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవాలి.
కోడిపందేలకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే ఇప్పట్నుంచీ బెట్టింగుల ఊపు అందుకుందని తెలుస్తోంది. తాజాగా జరిగిన ఓ పోలీస్ రైడ్ లో కోడి పందేల రాయుళ్ల నుంచి రూ. 3.31 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో... ఇప్పట్నుంచే కోడి పందేలు మొదలైపోయాయి అంటే... సంక్రాంతి వచ్చేసరికి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆలోచించుకోండి. అంతేకాదు, ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాల్లో చాలా హోటల్స్ లోని గదులు పందెం రాయళ్ల కోసం బుక్ అయిపోయినట్టు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నవారికి ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పుకుంటున్నారు. గతం కంటే ఈ ఏడాది పందేల జోరు మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అడ్వాన్సుల రూపంలో ఇప్పటికే కొంత మొత్తం చేతులు మారినట్టు చెప్పుకుంటున్నారు. రాబోయే సంక్రాంతికి కోడి పందేల బెట్టింగుల విలువ రూ. 350 నుంచి రూ. 450 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. మొత్తానికి, మోడీ సర్కారు గొప్పగా చెప్పుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కోడి పందేలపై ఏమాత్రం ప్రభావం పడలేదన్నమాట! మొత్తానికి, మోడీపై పందెం కోడి గెలిస్తుందన్నమాట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/