Begin typing your search above and press return to search.

గ‌ర్భిణీని ఆసుప‌త్రికి తీసుకువెళ్తుంటే నిరాకరించిన పోలీసులు...శిశివు మృతి!

By:  Tupaki Desk   |   22 April 2020 1:00 PM GMT
గ‌ర్భిణీని ఆసుప‌త్రికి  తీసుకువెళ్తుంటే నిరాకరించిన పోలీసులు...శిశివు మృతి!
X
కరోనా మహమ్మారి రోజురోజుకి వేగంగా విజృంభిస్తుంది. కాగా, క‌రోనా తీవ్ర‌త ఆధారంగా ప్రాంతాల‌ను రెడ్‌ - ఆరెంజ్‌ - గ్రీన్ జోన్ లుగా విభ‌జించిన విష‌యం తెలిసిందే. రెడ్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావ‌స‌ర స‌రుకులను సైతం ఇంటి ద‌గ్గ‌ర‌కే స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా రాక‌పోక‌లు సైతం పూర్తి గా నిషేధించారు. ఈ క్ర‌మంలో రెడ్ ‌జోన్‌ లో పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డానికి కూడా పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనతో ఇంట్లోనే ప్ర‌స‌వించిన మ‌హిళ శిశువును కోల్పోయిన‌ ఘ‌ట‌న జార్ఖండ్‌ లోని హింద్పిరిలో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... రాంచీలోని హింద్పిరిలో ఎక్కువగా క‌రోనా కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతం రెడ్‌ జోన్ ప‌రిధిలోకి వ‌చ్చింది. ఈ ప్రాంతానికి చెందిన‌ ఓ గ‌ర్భిణీ మ‌హిళ‌కు ఆదివారం రాత్రి 11 గంట‌ల‌కు నొప్పులు మొద‌ల‌య్యాయి. దీంతో ఆమె భ‌ర్త ఇంతియాజ్ - మిత్రుడి స‌హాయంతో ఆమెను తీసుకుని ఆసుప‌త్రికి బ‌య‌లు దేర‌గా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ప‌రిస్థితిని వివ‌రించి - వెళ్ల‌డానికి అనుమ‌తివ్వాల్సిందిగా వేడుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

దీనితో చేసేదేం లేక ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి స‌హాయంతో ఆమెకు ప్ర‌స‌వం చేయ‌గా పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. కానీ, సరైన సమయంలో వైద్యం అంద‌క‌పోవ‌డంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన‌ కాసేప‌టికే శిశువు మృతి చెందాడు. అయితే ఈ ఆరోప‌ణ‌లను అక్క‌డి పోలీసులు ఖండిస్తున్నారు. వేరే మార్గం గుండా ఆసుప‌త్రికి వెళ్తామ‌ని చెప్పి - ఆ తరువాత వారు ఇంటికి వెళ్లిపోయారని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.