Begin typing your search above and press return to search.

డంక్రెన్ డ్రైవ్ పేరిట పోలీసులు అత్యుత్సాహం

By:  Tupaki Desk   |   2 Jan 2019 10:38 AM GMT
డంక్రెన్ డ్రైవ్ పేరిట పోలీసులు అత్యుత్సాహం
X
డ్రంకెన్ డ్రైవ్ పేరిట పోలీసులు చేస్తున్న తనిఖీలు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తనిఖీల పేరిట వాహనదారులకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో కొందరు యువకులు తాగకున్న.. తాగినట్టు రీడింగ్ చూపిస్తుండటంతో కుయ్యొ మొర్రో అంటున్నారు. ఇలాంటిదే ఒకటి న్యూఇయర్ వేడుకల్లో చోటుచేసుకుంది.

సోమవారం అర్ధర్రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఇటీవల సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జహిరుల్లా ఖాద్రి అనే యువకుడు మద్యం తాగకున్న తాగినట్లు బ్రీత్ అనలైజర్లో రీడింగ్ రావడం తెల్సిందే. తాజాగా ఉప్పల్ కు చెందిన నాగభూషన్ రెడ్డి(32) విషయంలో ఇలాంటి సంఘటనే పునరావృతమైంది.

నాగభూషణం తాడ్ బండ్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలాఖరు కావడంతో ఆరోజు ఆఫీసులు లేటయింది. అర్ధరాత్రి 12గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలేదేరారు. మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో నాగభూషణం భారీగా మద్యం సేవించినట్లు రీడింగ్ చూపెట్టడంతో అవాక్కయ్యాడు. తాను ఎలాంటి మద్యం సేవించలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్పినా వినలేదు. పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి వాహనాన్ని సీజ్ చేశారు.

దీంతో నాగభూషణం చేసేదేమీలేక అప్పటికప్పుడు గాంధీ ఆసుప్రతికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు నాగభూషణంకు క్లీన్ చీట్ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను తీసుకొని తెల్లవారు స్టేషన్ వెళ్లగా పోలీసులు అతడి వాహనాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ రవిని వివరణ కోరగా బ్రీత్ అనలైజర్ పరీక్షలో నాగభూషణం మద్యం సేవించినట్లు నిర్దారణ అయిందని ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

దీంతో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ నిర్వహణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రమాద నివారణ కోసం కాకుండా చాలానా కోసమే డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము మద్యం సేవించకున్నా చలానా ఎందుకు కట్టాలని నిలదీస్తున్నారు. ఇకనైనా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను శాస్త్రీయంగా చేపట్టాలని లేకపోతే పోలీసులపై ఉన్న నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని బాధితులతోపాటు సామన్య ప్రజలు కోరుతున్నారు. మరీ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ.