Begin typing your search above and press return to search.
యోగి సర్కార్ ఇమేజ్ మొత్తం పోయేలా పోలీసు మాటలు
By: Tupaki Desk | 2 Oct 2020 3:55 PM GMTఅతిశయోక్తి అనిపించొచ్చు కానీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ రేప్ ఉదంతం అటు తిరిగి.. ఇటు తిరిగి యోగి సర్కారుకు చుట్టుకునేలా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన అత్యాచార ఘటనలో ఉన్నది ఉన్నట్లుగా విచారణ జరిపితే పోయేదేమిటి? హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న దిశ ఉదంతంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన వైనాన్ని యోగి సర్కారు అనుసరిస్తే పోయేదేమిటి? ఒక దారుణమైన నేరం చోటు చేసుకున్నప్పుడు.. దానికి వీలైనంత దూరంగా ఉంటూ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తే సరిపోతుంది. అది వదిలేసి.. దాన్ని కవర్ చేసేందుకు యోగి సర్కారు పడుతున్న శ్రమ చూస్తుంటే.. డౌన్ ఫాల్ షురూ అయ్యిందా? అన్న సందేహం కలుగక మానదు.
ఇదంతా ఒక ఎత్తు.. ఒక దారుణ హత్యాచారం (?) జరిగిన రెండు వారాల తర్వాత తాపీగా పోలీసులు ఆ పందొమ్మిదేళ్ల బాధిత మహిళపై అత్యాచారం జరగలేదని.. ఎలాంటి వీర్యం కనిపించలేదన్న మాట చెప్పుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక.. పోలీసులు వెల్లడించిన రిపోర్టు చూసినోళ్లకు నోట మాట రావటం లేదు. ఎందుకంటే.. ఒక దారుణ నేరానికి సంబంధించి రిపోర్టు ఇలా ఉంటుందా? అన్న సందేహం కలుగక మానదు.
పోలీసుల రిపోర్టులోని అంశాల్ని చూస్తే..
- శవ పరీక్ష నివేదికలో ఎలాంటి వీర్యం కనిపించలేదు
- పదే పదే గొంతు నులిమి పిసకటం వల్ల ఊపిరి ఆడలేదు
- మెదడు నుంచి వెన్నెముకకు దారి తీసే ఎముక విరిగింది
- అంతర్గతంగా.. బయటా రక్తస్రావం జరిగింది. ఈ గాయంతోనే ప్రాణం పోయింది
- ఆమె చున్నీనే మెడకు చుట్టి నులిమారు.
- ఆమె నరానికి సంబంధించిన మచ్చలు ఉన్నాయి
- ఆమె కన్నెపొరపై మానిన గాయాలు కనిపించాయి
- చిన్నప్రేవుల్లోనూ పాత చీలిక గాయాలు ఉన్నాయి
- గర్భాశయంలో రక్తం గడ్డ కట్టింది
- బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి.. యోనిలో రక్తం ఉంది (అది నెలసరి కావొచ్చు)
- వెనుక నుంచి వచ్చి మెడకు బలవంతంగా అదిమిపట్టటంతో ఎముకకు గాయం కావటం వల్లే చనిపోయింది