Begin typing your search above and press return to search.

లండన్ బస్సు ఇష్యూలో ఆ ఇద్దరిని గుర్తించారు

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:15 AM GMT
లండన్ బస్సు ఇష్యూలో ఆ ఇద్దరిని గుర్తించారు
X
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కార్యకలాపాలేమో కానీ.. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింల మీద పడుతోంది. ఐఎస్ తో ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ‘‘ముస్లిం’’ అన్న కారణంగా భౌతికదాడులు ఎదుర్కొంటున్నారు. తమ రాక్షస వైఖరితో ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్.. అదే సమయంలో.. ప్రపంచంలోని చాలా దేశాల్లోని పౌరులకు ముస్లింల మీద అసహనం పెరిగిపోయేలా చేయటంలో విజయం సాధించారనే చెప్పాలి.

తమ వరుస ఉగ్రచర్యలతో యూరప్ లోని ముస్లింలపై మిగిలిన వర్గాల వారు అనుమానంగా చూడటం.. అవకాశం వస్తే అవమానించేందుకు ఏమాత్రం సంశయించకపోవటం ఈ మధ్యన ఎక్కువైంది. ఈ అక్టోబరులో బ్రిటన్ లో చోటు చేసుకున్న ఘటన షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. లండన్ నగరంలోని బస్సులో ప్రయాణిస్తున్న 40 ఏళ్లు ముస్లిం మహిళపై అదే బస్సులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ఇద్దరు యువతులు భౌతిక దాడికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ముస్లిం మహిళ ముఖంపై పిడిగుద్దులు గుద్దేసిన వారు.. ఆమెను బస్సులో నుంచి తోసేశారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళను ఉద్దేశించి ఇద్దరు మహిళలు జ్యాత్యాంహకార వ్యాఖ్యలు చేయటం పెద్ద చర్చకే దారి తీసింది. అక్టోబరు 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు విపరీతంగా ప్రయత్నించారు. తాజాగా వారిని గుర్తించారు. సీసీ కెమేరాల ఫుటేజ్ సాయంతో వారిని గుర్తించిన పోలీసులు ఇప్పుడు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.