Begin typing your search above and press return to search.
ఆ రైతు దగ్గర 44 ఏటీఎం కార్డులు
By: Tupaki Desk | 5 Dec 2016 7:24 AM GMTపెద్దనోట్ల రద్దు నిర్ణయం పుణ్యమా అని.. దేశంలో చిత్ర విచిత్రమైన ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకివస్తున్న ఈ ఉదంతాలు దేశ ప్రజలకు దిమ్మ తిరిగిపోయేలా ఉంటున్నాయి. నిన్నటికి నిన్ననే.. ఒక వ్యక్తి స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం కింద తన ఆస్తి రూ.13,860 కోట్లు అని ప్రకటించి.. చివరకు అదంతా కొందరి కారణంగా చెప్పిందే తప్పించి.. తనకు సంబందించిన మొత్తం కాదని చెప్పటం తెలిసిందే. ఈ సంచలనం ఒక కొలిక్కిరాక ముందే..తాజాగా ఒక కుటుంబం తమ ఆస్తి రూ.2లక్షల కోట్లుగా ప్రకటిస్తూ.. దరఖాస్తు చేయటం.. సందేహం వచ్చిన పోలీసులు దీనిపై విచారణ జరపగా అదంతా అబద్ధమని తేలింది.
ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రమైన అసోంకు చెందిన ఒక రైతు ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. రైతుగా చెప్పే జింటూ బోరా దగ్గర ఏకంగా 44 ఏటీఎం కార్డులు.. 37 బ్యాంకు.. పోస్టాఫీసు పాస్ బుక్కలు ఉండటం ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు 34 చెక్కు బుక్కులు.. 200 బ్లాంక్ చెక్కులు.. రూ.22,380 క్యాష్ తో పాటు కొన్ని ఖాళీ స్టాంప్ పేపర్లు దొరికాయి.
ఒక రైతు దగ్గర ఇన్నేసి బ్యాంకు ఖతాలు.. పదుల సంఖ్యలో డెబిట్ కార్డులు ఉండటం షాకింగ్ గా మారింది. అయితే.. తాను పలువురికి అప్పులిచ్చానని.. ముందస్తుగా వారి దగ్గరి పాస్ బుక్కులు.. ఏటీఎం కార్డులు దాచి ఉంచానే తప్పించి.. అవన్నీ తనవి కాదని ఆయన చెబుతున్నారు. పేరుకు రైతుగా చెబుతూ.. చేస్తున్నది వడ్డీ వ్యాపారమన్న విషయం అర్థమవుతుంది. ఈ లెక్కన ఇలాంటి బడా వడ్డీ ‘‘రైతులు’’ ఉదంతాలు మరెన్ని బట్టబయలు కానున్నాయో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/