Begin typing your search above and press return to search.
ఎన్నికలవేళ భారీగా బంగారం, నగదు పట్టివేత
By: Tupaki Desk | 5 April 2019 11:36 AM GMTదేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కట్టల పాములు బయటకు వస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలవడానికి పార్టీలన్నీ ప్రయత్నాలు ప్రారంభించాయి. కోట్లో కొద్దీ నగదు, కిలోల కొద్ది బంగారం పట్టుబడుతుండడంతో కలకలం రేగుతోంది.
తమిళనాడులో తాజాగా జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం, నగదు పట్టుబడింది. సేలం జిల్లా ఏర్కాడు పరిధిలోని మేట్టుపట్టిలో టెంపో వ్యాన్ ను అధికారులు సోదా చేయగా.. 100 కిలోల బంగారు నగలు లభించాయి. ఇది సేలంలోని ప్రముఖ నగల వ్యాపారి దుకాణానికి తరలిస్తున్నట్టు సమాచారం. కానీ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వ్యాన్ ను జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఇక తమిళనాడులోనే తిరువణ్ణామలై జిల్లా ఆరూరులో బస్సులో తరలిస్తున్న రూ.3.5కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఏపీలోనూ కట్టలు బయటపడ్డాయి. అనంతపురం-బెంగళూరు హైవేపై ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద రూ.1.75 కోట్ల నగదు పట్టుబడింది. లోక్ సభ ఎన్నికల కోసమే టోల్ ప్లాజా యజమాని ఈ నగదును తీసుకొచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇక తెలంగాణలోనూ పోలీసు తనిఖీల్లో హవాలా డబ్బు బయటపడింది. బంజారాహిల్స్ లోని నగల వ్యాపారి అనిల్ అగర్వాల్ ఇంట్లో రూ.3.50కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ఈ వ్యాపారీ హవాలా రూపంలో మనీ సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాష్ అనే వ్యక్తి అనిల్ అగర్వాల్ కు రూ.కోటి ఇచ్చినట్లుగా విచారణలో తేలింది.