Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు..10 కోట్ల నగదు పట్టివేత!!

By:  Tupaki Desk   |   20 Oct 2018 4:40 AM GMT
తెలంగాణ ఎన్నికలు..10 కోట్ల నగదు పట్టివేత!!
X
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎక్కడికక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు - మద్యం - బెల్టు షాపుల సోదాలు చేస్తే హడలెత్తిస్తున్నారు. రాష్ట్ర - జిల్లా నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల్లో నగదు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున గల ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చేపట్టిన తనిఖీల్లో పోలీసులకు కళ్లు బైర్లు గమ్మే నగదును పట్టుబడింది. పిప్పరివాడ టోల్ ప్లాజా వద్ద సోదాలు జరిపిన ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 10కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

ఈ నగదును మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ సర్వేష్ - వినోద్ శెట్టిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ 10 కోట్ల నగదు మొత్తం రూ.500 నోట్ల రూపంలోనే ఉందని పోలీసులు తెలిపారు.

ఈ కారు రిజిస్ట్రేషన్ కర్ణాటక పేరుతో ఉంది. పట్టుబడ్డ వారిది కూడా కర్ణాటకనే.. ఈ విషయం తెలియగానే పోలీసులు రిటర్నింగ్ అధికారి - ఆర్డీవో - డీఎస్పీలకు సమాచారం అందించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.