Begin typing your search above and press return to search.

జనసేన కి పోలీసులు షాక్ .. ఆ సభకి అనుమతి నిరాకరణ !

By:  Tupaki Desk   |   30 Oct 2021 10:33 AM GMT
జనసేన కి పోలీసులు షాక్ .. ఆ సభకి అనుమతి నిరాకరణ !
X
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 31న జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. విశాఖలో సభ వేదికపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద సభా వేదిక ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే సభావేదిక మార్చాలని పోలీసులు జనసేన నేతలకు సూచించారు. కానీ జనసేన నేతలు మాత్రం పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా సభ అక్కడే నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు. బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తూ, కరపత్రాలు కూడా పంచారు. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు,వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు. అయితే, వైజాగ్‌ లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డు పై సభ ఏర్పాటుకు సిద్ధం అయ్యాయి జనసేన శ్రేణులు, ఇప్పటికే ఆ ప్రాంతానికి లారీల్లో స్టేజ్ మెటీరియల్ తరలించారు. అయితే, ఆ ప్రాంతంలో సభకు మాత్రం ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

స్టేజ్ ఫేసింగ్ పై పోలీసులు, సభ నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్ సభకు వేలాదిగా జనం తరలివస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోతుందని పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు. కానీ, సభకు వచ్చేవారిని అడ్డుకోవడానికే పోలీసులు అభ్యంతరాలు చెబుతున్నారంటూ జనసేన పార్టీ ఆరోపణలు చేస్తుంది. విశాఖ ఉక్కు భావోద్వేగాలతో కూడిన అంశమని ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన పవన్‌కల్యాణ్‌ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరారు. 34 మంది ప్రాణ త్యాగాలతో ఈ కర్మాగారం ఏర్పాటైందన్న విషయాన్ని అమిత్‌షాకు వివరించారు. కానీ విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పులేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగానే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో నిరసనలు జరుగుతున్నాయి.