Begin typing your search above and press return to search.
చిన్నమ్మ వెళ్లింది.. రిసార్ట్స్ కు పోలీసులు వెళ్లారు
By: Tupaki Desk | 15 Feb 2017 1:37 PM GMTతమిళనాడు రాజకీయాల్లో పలు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ దోషిగా నిరూపితం కావటం.. జైలుకు వెళ్లటం అనివార్యమైన వేళ..పరిస్థితులు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. పలు నాటకీయ పరిణామాల మధ్య భారీ కాన్వాయ్ తో చెన్నైను విడిచి బెంగళూరు వైపు కారులో చిన్నమ్మ వెళ్లిన కాసేపటికే.. పోలీసు బలగాలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ వద్దకు చేరుకోవటం గమనార్హం.
వారానికి పైనే కువతూర్ సమీపంలోని రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించని పోలీసులు.. తాజాగా ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా కదిలారు. తనను బంధించి రిసార్ట్స్ లో ఉంచారని.. తాను తప్పించుకువచ్చినట్లుగా చెప్పటంతో పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేను ముగ్గురు.. నలుగురు రౌడీల బృందం కాపాలా కాస్తుందన్న మాటను ఆయన చెప్పటంతో పెద్దఎత్తున పోలీసు బలగాలు రిసార్ట్స్ వద్దకు వెళ్లాయి.
వెంటనే రిసార్ట్స్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.రిసార్ట్స్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సోదాలుజరుపుతున్నారు. వాస్తవానికి ఈ తరహా ఆరోపణలు ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఆరోపణలు.. విమర్శలు వచ్చినప్పటికీ పోలీసుల స్పందన అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు మొదలు కావటం గమనార్హం. అంతేకాదు.. శశికళ.. పళనిస్వామిలపై కిడ్నాప్ కేసును నమోదు చేసి విచారిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా నిర్వహిస్తున్న సోదాలకు నలుగురు ఎస్పీల తో పాటు.. 3వేల మంది పోలీసులు పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. పోలీసుల సోదాల్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకొని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తాజాగా చేపట్టిన చర్యతో గడిచిన కొద్దిరోజులుగా తమిళనాడురాష్ట్ర రాజకీయాలకుకేంద్రంగా మారిన గోల్డెన్ బే రిసార్ట్స్ ఖాళీ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/