Begin typing your search above and press return to search.
బాంబు మాటతో బెదిరిపోయిన అమీర్ పేట
By: Tupaki Desk | 5 Dec 2015 8:10 AM GMTనిత్యం సందడిగా ఉంటూ.. వేలాది మందితో కిక్కిరిసినట్లుగా ఉండే.. అమీర్ పేట మైత్రీవనం ఏరియాలో శనివారం ఉదయం బాంబు మాట హడలు పుట్టించింది. టైంతో సంబంధం లేకుండా ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్ పేటలోని సత్యం థియేటర్ వద్ద సూట్ కేస్ బాంబు మాట పెద్ద కలకలాన్నే రేపింది.
సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్ కేస్ పడి ఉంది. దీన్లో బాంబు పెట్టి ఎవరో పడేసి వెళ్లి ఉంటారన్న మాట మొదలై.. క్షణాల్లో ప్రజలంతా అప్రమత్తమైన పరిస్థితి. దీనికి తోడు డిసెంబరు 6 (అయోద్యలో వివాదాస్పద కట్టటం కూలిన రోజు) దగ్గర్లో ఉన్న నేపథ్యంలో బాంబుదాడితో ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో ఎవరైనా బాంబుపెట్టారా? అన్న సందేహాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.
సూట్ కేస్ బాంబు కలకలంతో అమీర్ పేట పరిసర ప్రాంతాల ప్రజలు హడలిపోతుంటే.. మరోవైపు బాంబ్ స్క్వాడ్ వచ్చి.. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సూట్ కేసులో ఎలాంటి బాంబు లేదని తేల్చటంతో ఊపిరి పీల్చుకున్నారు. సూట్ కేస్ బాంబు మాట బెదిరిపోయేలా చేసిందనే చెప్పాలి.