Begin typing your search above and press return to search.
ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పోలీసులకేం చెప్పాడు?
By: Tupaki Desk | 3 April 2016 3:46 AM GMTచిన్నారి పెళ్లి కూతురు ఆనంది పాత్రధారి నటి ప్రత్యూష బెనర్జీ సూసైడ్ వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఆమెది ఆత్మహత్య కాదని.. హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యూష మృతి వార్త బయటకు వచ్చిన తర్వాత నుంచి అతడి ఆచూకీ లేకుండాపోవటం.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
రాహుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారించారు. ఈ సందర్భంగా రాహుల్ పోలీసులకు చెప్పిన వివరాలకు సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. రాహుల్ చెప్పిన దాని ప్రకారం..
తాను.. ప్రత్యూష ఇద్దరం గత కొంతకాలంగా ఒక డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో ఉంటున్నామని.. ఇద్దరి దగ్గర చెరో తాళం చెవి ఉంటుందని పేర్కొన్నాడు. తాను తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రత్యూష ఉరి వేసుకొని ఉన్న దృశ్యం కనిపించిందని.. తాను వెంటనే ఇరుగు.. పొరుగు వారి సాయంతో ఆమెను కిందకు దించి.. కోకిలబెన్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె బతికే ఉందని తాను భావించినట్లుగా వెల్లడించాడు. అయితే.. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమె చనిపోయిన విషయం తెలిసిందని.. ఆ సమయంలో తానెంతో భయపడినట్లుగా పేర్కొన్నాడు. ఈ కారణంతోనే తాను పోలీసులకు సమాచారం అందించలేదని.. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చాయని చెప్పాడు. ఇదిలా ఉంటే.. ప్రత్యూష.. రాహుల్ మధ్య శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలే ఆమెను సూసైడ్ చేసుకునేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. వీరిద్దరూ ఒక మాల్ లో గొడవ పడ్డారని.. ఈ సందర్భంగా ప్రత్యూష మీద రాహుల్ చేయి చేసుకున్నాడని చెబుతున్నారు. మరోవైపు.. ఇంట్లో ఆమె సూసైడ్ చేసుకున్నాక.. ఆమె ఫోన్ తీసుకొని నెమ్మదిగా జారుకున్నాడన్న ఆరోపణ వినిపిస్తోంది.
తాజాగా ప్రత్యూష మరణానికి కారణం ఏమిటన్న విషయాన్ని వెల్లడించే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ నివేదిక ప్రకారం.. ఆమెది ఆత్మహత్యగానే పేర్కొన్నారు. ఊపిరి ఆడని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయి ఆమె మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.