Begin typing your search above and press return to search.
ఖాకీలకు కొత్త టెన్షన్ గా మారిన 'చలో రావులపాలెం'
By: Tupaki Desk | 25 May 2022 7:32 AM GMTఅసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నంతనే.. అప్పటివరకు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం సైతం ఒక్కసారి తగ్గిపోతుంది. కోనసీమ జిల్లా పేరును అదే పేరుతో కంటిన్యూ చేయాలని.. కొత్త పేర్లు ఏమీ దానికి ఉండకూడదన్న సింగిల్ లైన్ డిమాండ్ తో ఆందోళన చేపట్టిన వైనం.. మంగళవారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటంతో పాటు.. సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడూ చూడని కొత్త తరహా ఆందోళనలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి.
మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాత్రి 10 గంటల ప్రాంతానికి అమలాపురం పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవటంలో పోలీసులు సక్సెస్ అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నట్లు చెబుతున్నారు.
ఎవరికి వారు గుంభనంగా ఉంటూ.. తమ డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గే వరకు వెనక్కి తగ్గకూడదన్న విషయంపై పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. కోనసీమ జిల్లా సాధన సమితి అనూహ్యంగా ఈ రోజు చలో రావులపాలెం కార్యక్రమానికి పిలుపునివ్వటంతో ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది.
చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. అంతేకాదు అమలాపురానికి తాత్కాలికంగా ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేయటంతో పాటు. .కాకినాడ.. రాజమండ్రి నుంచి కూడా కోనసీమకు సర్వీసులు రద్దు చేయటం గమనార్హం. సాధారణ పరిస్థితుల్ని పునరుద్దరించేందుకు హోటళ్లు.. వ్యాపార సంస్థలు తెరవాలని అధికారులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (బుధవారం) ఉదయం నుంచి అమలాపురంలో వర్షం పడుతోంది. దీంతో.. ఇప్పటివరకు అమలు చేస్తున్న అప్రకటిత కర్ఫ్యూను సడలించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పరిస్థితి సాధారణంగా వస్తున్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవంగా మాత్రం అలా లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ రోజు పిలుపునిచ్చిన చలో రావులపాలెం పోలీసు వర్గాల్లో కొత్త టెన్షన్ గా మారిందని చెబుతున్నారు.