Begin typing your search above and press return to search.
మల్లాది విష్ణు మీద ‘కామ’ దెబ్బ పడింది
By: Tupaki Desk | 14 Dec 2015 9:16 AM GMTఏపీలో ‘‘కామ’’ (కాల్ మనీ) ఇష్యూ రచ్చ రచ్చగా మారింది. రూ.5 నుంచి రూ.10 వడ్డీలకు అప్పులు ఇవ్వటం.. దాన్న తిరిగి చెల్లించే విషయంలో తేడా వస్తే.. ఆస్తులు ఆక్రమించుకోవటం.. మహిళల్ని బలవంతంగా లొంగదీసుకోవటం.. భౌతిక దాడులకు పాల్పడటం లాంటి ఎన్నో దుర్మార్గాలకు ‘‘కామ’’ కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఈ వ్యవహారంలో ఏపీ అధికారపక్షమైన టీడీపీ తమ్ముళ్లు మొదలు.. కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటా బడా నేతల హస్తం ఉన్నట్లుగా చెబుతారు.
ఇప్పటివరకూ కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతలు.. ప్రభుత్వ ఉద్యోగులు.. పోలీసు అధికారులు కొందరి పేర్లు బయటకు రాగా.. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో అడ్డంగా బుక్ అయి.. అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన ఆయనకు ‘‘కామ’’ వ్యవహారంలో సంబంధం ఉందంటూ వచ్చిన ఫిర్యాదు భారీ షాక్ గా మారుతుందని చెబుతున్నారు.
ఏపీని ఊపేస్తున్న కామ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి నీచమైన పనులు చేసే వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని.. ఎవరిని ఉపేక్షించొద్దంటూ విస్పష్ట ఆదేశాలు ఇవ్వటంతో పాటు.. సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మరోసారి హెచ్చరించారు. కాల్ మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతామని.. కాల్ మనీ బాధితులు ఎవరూ డబ్బులు తిరిగి చెల్లించొద్దంటూ చంద్రబాబు ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా సులోచన అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ తమకు రూ.లక్ష అప్పుగా ఇచ్చి బదులుగా రూ.4లక్షలు వసూలు చేశారని.. తన ఇంటిని కూడా లాక్కున్నారంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. మల్లాది విష్ణు.. ఆయన అనుచరుడు గణేశ్ మీద విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కు సులోచన ఫిర్యాదు ఇచ్చారు. తాజా ఫిర్యదుతో స్వర్ణబార్ ఇష్యూలో పీకల్లోతు ఇబ్బందుల్లో పడిన విష్ణుకు మరో పెద్ద ఎదురు దెబ్బగా చెబుతున్నారు. చేసిన పాపాలన్నీ ఒకేసారి పండుతున్నాయా..?