Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ గౌడ్‌ కాల్పులు..సంచ‌ల‌న నిజాలు

By:  Tupaki Desk   |   2 Aug 2017 10:47 AM GMT
విక్ర‌మ్ గౌడ్‌ కాల్పులు..సంచ‌ల‌న నిజాలు
X
మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్ కాల్పుల కేసులోని అనేక ట్విస్ట్‌ల‌ను పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేధించామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. విక్రమ్‌ గౌడ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపించుకున్నారని ఆయ‌న తెలిపారు. సుపారీ గ్యాంగ్ తో కాల్పులకు ఆరు నెలల నుంచి విక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలిపారు. షార్ప్ షూటర్ ని ఎంపిక చేసుకుని కాల్పులకు పథకం వేసుకున్నాడని వివ‌రించారు. ముందుగానే విక్రమ్ తన ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడ‌ని సీపీ వెల్ల‌డించారు.

విక్రమ్‌ గౌడ్ 4 నెలల క్రితమే ఈ ఘటనకు ప్లాన్ చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. గాయపర్చుకుంటే తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి వస్తుందనుకున్నాడని వివ‌రించారు. తనతో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులపై ఒత్తిడి వస్తుందనుకున్నాడు. ప్రణాళిక అమలులో భాగంగా కడప జిల్లా వేముల మండలానికి చెందిన గోవిందరెడ్డికి విక్రమ్‌ గౌడ్ తన ప్లాన్ చెప్పాడని సీపీ చెప్పారు. గోవిందరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి విక్రమ్ తనపై కాల్పులు జరిపించుకున్నాడని స్పష్టం చేశారు. గోవిందరెడ్డికి అప్పటికప్పుడు రూ. 5 లక్షలు విక్రమ్ ఇచ్చారని పేర్కొన్నారు. పని పూర్తయ్యాక రూ. 50 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

ఎవరెవరు ఏమి చేయాలనేది విక్రమ్‌ గౌడ్ ప్లాన్ చేసినట్లు సీపీ మ‌హేంద‌ర్ రెడ‌డ్ఇ వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన నందకుమార్‌ను విక్రమ్ స్పందించారు. అయితే అప్ప‌టికే నందకుమార్‌పై ఏడు క్రిమినల్ కేసులున్నాయి. నందకుమార్‌కి గోవిందరెడ్డి మూడున్నర లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. జులై 6న విమానంలో నందు గ్యాంగ్ సభ్యులు ఇండోర్ వెళ్లారు. రూ. 30 వేలు ఇచ్చి రయీస్ ద్వారా నిందితులు ఆయుధం కొన్నారు. ఇండోర్ నుంచి బస్సులో వెంకటరమణ తుపాకీ తీసుకొచ్చాడని సీపీ చెప్పారు. జులై 8న బాలానగర్‌లో విక్రమ్‌గౌడ్‌కు నిందితులు తుపాకిని అందజేశారు. ఆ రోజు నుంచే కాల్పులు జరిగే నాటి వరకు విక్రమ్ ఇంట్లోనే తుపాకీ ఉందన్నారు.

నందకుమార్ తండ్రికి బాగా లేదంటే విక్రమ్‌ గౌడే లక్షన్నర ఇచ్చారని సీపీ తెలిపారు. విక్రమ్‌గౌడ్ తన సొంత వాహనంలో నందను పుట్టపర్తికి పంపించారు. విక్రమ్ ఒత్తిడితో నందకుమార్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. కాల్పులు కూడా ఎలా జరపాలో పక్కా ప్లాన్ చేసుకున్నారని పేర్కొన్నారు. నిందితులు రూ. 30 వేలు పెట్టి బైక్ కూడా కొన్నారని తెలిపారు. భార్య కానీ, వాచ్‌మెన్ కానీ చూస్తే ఒక రౌండ్ కాల్పులు జరపాలని విక్రమ్ గౌడ్ వారికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అపోలోకి దగ్గరలో ఉన్న తేజ్ నివాస్ గెస్ట్‌హౌజ్‌లో నిందితుల కోసం ఒక రూం కూడా బుక్ చేసినట్లు చెప్పారు. విక్రమ్‌గౌడ్ పేరుమీదే రూం కూడా బుక్ చేసినట్లు ఉందని సీపీ స్పష్టం చేశారు.