Begin typing your search above and press return to search.

ఐపీఎల్ బెట్టింగ్ లో స్టార్ హీరో సోదరుడు

By:  Tupaki Desk   |   2 Jun 2018 10:37 AM GMT
ఐపీఎల్ బెట్టింగ్ లో స్టార్ హీరో సోదరుడు
X
2008లో భారత క్రికెట్ ను - బాలీవుడ్ ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు ఓ హై ప్రొఫైల్ బుకీ జలన్ తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురిచేసే విషయాలు తాజాగా వెలుగుచూశాయి. గత సీజన్ లలో జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్ లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వందమంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు.

తాజాగా ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్భాజ్ ఖాన్ పేరు వెలుగులోకి వచ్చింది. అర్భాజ్ ఐపీఎల్ బెట్టింగ్ లో రూ.3కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసులనుంచి సమన్లు అందుకున్న అర్భాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరవ్వడం సంచలనమైంది. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది.

గత ఐపీఎల్ సీజన్ లో రూ. 2.75 కోట్లు పోగొట్టుకున్న అర్భాజ్ ఈసారి 3 కోట్ల దాకా నష్టపోయడట.. ఐదేళ్లుగా ఐపీఎల్ బుకీ జలన్ తెలుసు అని.. కొంతకాలంగా తాను బెట్టింగ్ లో డబ్బులు పెడుతున్నానని అర్భాజ్ అంగీకరిచారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విచారణ అనంతరం ‘అర్భాజ్ వచ్చారు. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశాం’ అంటూ సీనియర్ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్భాజ్ ఖాన్.. జలన్ తో వాట్సాప్ చాటింగ్ లు పోలీసులు చూపించాక అసలు విషయాలు వెల్లడించాడట.. దీంతో మరో ప్రముఖుడు ఈ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఇరుక్కుపోవడం తాజాగా సంచలనమైంది.