Begin typing your search above and press return to search.
శృతిని రేప్ చేసి.. యాసిడ్ పోసి.. కాల్చేశారా?
By: Tupaki Desk | 17 Sep 2015 4:52 AM GMTవరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న తాజా ఎన్ కౌంటర్ లో మరణించిన శృతి మృతదేహం ఇప్పుడు పలు అనుమానాలకు తావివ్వటమే కాదు.. విమర్శలకు కారణం అవుతోంది. మొత్తం ఎన్ కౌంటర్ మీద పోలీసులు చెబుతున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టేలా ఉంది. మొత్తంగా తాజా ఎన్ కౌంటర్ వివాదాస్పదం అవుతోంది.
ఎన్ కౌంటర్ లో మరణించిన శృతి మృతదేహాన్ని చూసిన వారు..దేహం మీద ఉన్న గాయాలు విన్న వారు ఆవేశంతో రగిలిపోతున్నారు. మరీ.. ఇంత అమానుషంగా.. పాశవికంగా హత్య చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బుల్లెట్టు గాయాలు మాత్రమే ఒంటి మీద ఉండాల్సి ఉండగా అందుకు భిన్నంగా పొత్తి కడుపు మీదా.. దాని కింది భాగం దారుణంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తన కూమార్తెను అత్యాచారం చేసి.. యాసిడ్ పోసి తీవ్రంగా హింసించినట్లుగా శృతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గదిలో తమ కూతుర్ని చూసి వచ్చిన వారు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. పొట్ట మీద.. పొత్తి కడుపు భాగంలోనూ.. చేతలు మీద గాయాలున్నట్లు చెబుతున్నారు.
ఇక.. మహిళా మావోలు అంటే తప్పనిసరిగా నెక్ టీ షర్ట్ లు వేసుకుంటారని.. కానీ.. శృతి శరీరంపై నెక్ టీ షర్ట్ లేదని.. ఆమె శరీరంపై కాలిన గాయాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. యాసిడ్ పోయటం వల్లే ఇన్ని గాయాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు. నిజంగా ఎన్ కౌంటర్ మాత్రమే జరిగి ఉంటే.. బుల్లెట్టు గాయాలు మినహా శరీరంపై మరెలాంటి గాయాలు ఉండకూడదని.. కానీ.. తాజా ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరి మృతదేహాలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శృతి మృతదేహం మీద గాయాల గురించి విన్నవారంతా తీవ్ర ఆవేశానికి గురి అవుతుండటం గమనార్హం.
ఇక.. ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరిలో శృతి శరీరంలో ఆరు బుల్లెట్లు దిగితే.. ఆమెతో మరణించిన విద్యాసాగర్ కు ఎనిమిది తూటాలు దిగాయని.. అతగాడి మర్మాంగం వద్ద తీవ్రంగా గాయాలయ్యాయని చెబుతున్నారు. పోస్ట్ మార్టం సందర్భంగా శృతి దేహంలో దిగిన ఆరు తూటాలు శరీరంలో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
మొత్తం ఆరు బుల్లెట్లలో ఛాతీలో రెండు.. ఎడమ కాలుకు రెండు.. చేతికి రెండు తూటాలు తగిలినట్లుగా చెబుతున్నారు. శరీరంలో ఒక్క బుల్లెట్లు కూడా దిగలేదని చెబుతున్నారు. ఇక.. మావోలకు సంబంధించి ఒక కీలక ప్రశ్నను పౌరహక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు. అడవుల్లో తారసపడి.. ఎదురు కాల్పుల్లో మావోలు ఇద్దరు మరణించినట్లు చెప్పిందే నిజమైతే.. వారు షూ తప్పనిసరిగా ధరిస్తారని.. కానీ.. ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరి కాళ్లకు షూ లేవన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఎన్ కౌంటర్ లో శృతితో పాటు మరణించిన విద్యాసాగర్ దేహం నుంచి నాలుగు బుల్లెట్లు తీశారు. మరో నాలుగు లభించలేదు. మొత్తంగా చూస్తే పోలీసులు చెప్పినట్లుగా ఎన్ కౌంటర్ లో ఇరువురు మావోలు చనిపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారి ఒంటి మీద ఉన్న గాయాలు.. బుల్లెట్లు దిగిన తీరు చూస్తూ.. మావోలు ఇద్దరిని అత్యంత కిరాతకంగా.. అమానవీయంగా చంపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.