Begin typing your search above and press return to search.
యూపీ పోలీసుల దెబ్బకు రాహుల్ పనోడయ్యాడు
By: Tupaki Desk | 27 May 2016 11:21 AM GMTడ్యూటీకి ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండే పోలీసులు ఎంతోమంది. వీరికి భిన్నంగా నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపమన్నట్లుగా మరికొందరు పోలీసులు పని చేస్తుంటారు. అలాంటి వారి పుణ్యమా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏకంగా పనోడ్ని చేసేశారు. వాస్తవంలో కాకున్నా.. రికార్డుల పరంగా రాహుల్ ను ఇంటి పనోడిగా చేసిన ఘనత యూపీలోని ఘజియాబాద్ పోలీసులకు దక్కిందని చెప్పొచ్చు.
ఘజియాబాద్ లోని ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలగా మారింది. ఒక వ్యక్తి తన ఇంట్లో హెల్పర్ గా ఉన్నాడంటూ రాహుల్ గాంధీ ఫోటోను అతికించి వెరిఫికేషన్ కు ఇచ్చారు. పోలీసుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే.. సదరు ఫోటో కింద హెల్పర్ చిరునామా వివరాలుగా ఇంటి నెంబరు 12, తుగ్లక్ లేన్.. న్యూఢిల్లీ అని రాయటమే కాదు.. వృత్తి దగ్గర రాజకీయాలు.. మెరిటల్ స్టేటస్ దగ్గర పెళ్లి కాలేదన్న వివరాల్ని కూడా నమోదు చేశారు.
అయినప్పటికీ వీటిని పట్టించుకోని అధికారులు రాహుల్ ఫోటో ఉన్న ఫామ్ ను వెరిఫై చేసినట్లుగా ఓకే చేసేశారు. ఈ వ్యవహారం తెర మీదకు రావటంతో ఘజియాబాద్ పోలీసులు స్పందించి.. ఇదంతా పాత వ్యవహారమని.. ఆకతాయిలు చేసిన పనిగా కొట్టేశారు. ఎంత ఆకతాయి చేస్తే మాత్రం.. పోలీసులు ఏం చేస్తున్నట్లు? ఎలా పడితే అలా స్టాంప్ వేసేస్తారా? అన్న ప్రశ్నలకు మాత్రం నీళ్లు నమిలే పరిస్థితి.