Begin typing your search above and press return to search.
పాక్ నటుడిని తీసి పడేశారు
By: Tupaki Desk | 27 Sep 2016 7:30 PM GMTఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు.. సాంకేతిక నిపుణులు ముంబయి వదిలి పారిపోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన హెచ్చరించడం.. కొందరు పాకిస్థానీ కళాకారులు భయపడి స్వదేశానికి వెళ్లిపోతుండటం తెలిసిన సంగతే. ఐతే ఈ సెగలు బ్రిటన్ వరకు తాకడం విశేషం. ఓ పాక్ నటుడు అనవసరంగా నోరు జారి మంచి అవకాశాన్ని కోల్పోయాడు. ఉరీ దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ మీద దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో బ్రిటన్లో ఉంటున్న పాకిస్థాన్ నటుడు మార్క్ అన్వర్ కు మండిపోయింది.
అతను తన దేశానికి మద్దతుగా నిలుస్తూ ట్వీట్లు చేశాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ. భారత్ మీద అక్కసు వెళ్లగక్కడంతోనే వచ్చింది సమస్య. భారత్ ను తిట్టిపోస్తూ రాయడానికి వీల్లేని భాషలో రెచ్చిపోయాడు అన్వర్. ఈ వ్యాఖ్యలు బ్రిటన్ చట్టాల ప్రకారం జాతి విద్వేష వ్యాఖల కిందకి రావటంతో అతడిపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అంతే కాదు అన్వర్ నటిస్తున్న పాపులర్ టీవీ సీరియల్ నుంచి దర్శక నిర్మాతలు అతణ్ని తప్పించారు.
అన్వర్ నటిస్తన్న సీరియల్ పేరు.. కొరొనేషన్ స్ట్రీట్. బ్రిటన్‌లో ఈ సీరియల్ బాగా పాపులర్. దీని ద్వారా అన్వర్ బాగానే సంపాదిస్తున్నాడు. ఐతే అనవసర వ్యాఖ్యల పుణ్యమా అని అవకాశం పోయింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై చింతిస్తూ.. భారతీయులకు క్షమాపణ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసినా ఫలితం లేకపోయింది.