Begin typing your search above and press return to search.
సూర్యాపేటలో పోలీస్ జీపునే కొట్టేశాడు
By: Tupaki Desk | 10 Jun 2018 4:42 AM GMTసూర్యాపేటలో సంచలన ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి మరేదీ దొరకనట్లుగా.. ఏకంగా దొంగల్ని పట్టుకునే పోలీసుల జీపునే దొంగతనం చేసిన వైనం సంచలనంగా మారింది. పట్టపగలు.. పోలీసుల కళ్లు గప్పి జీపు తీసుకొని పారిపోయిన వైనం సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.. సూర్యాపేట గ్రామీణ సీఐ ప్రవీణ కుమార్ శనివారం సూర్యాపేటలోని ఒక జిమ్ కు వెళ్లారు. పోలీసు జీపు దగ్గర డ్రైవర్ సైదులు ఉన్నాడు.ఇదిలాఉండగా.. టూవీలర్ మీద వచ్చిన ఒక వ్యక్తి సైదులు దృష్టి మరల్చి.. సీఐ పిలుస్తున్నారంటూ అబద్ధం చెప్పాడు.
అతను చెప్పిన మాటను నమ్మిన సైదులు పోలీసు.. జీపును వదిలేసి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు పోలీసు జీపు అపహరించుకొని పారిపోయాడు. పోలీసు వెహికిల్‌ను కొట్టేసి పారిపోతున్న వ్యక్తిని అతను వేసుకొచ్చిన టూ వీలర్ తో వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. పోలీసు జీపును కొట్టేసిన వైనాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమేరా పుటేజ్ సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించారు. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుగా గుర్తించారు.
వాహనాన్ని దొంగలించి సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్లిన వైనాన్ని గుర్తించి చివరకు ఖమ్మం జిల్లాలో అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అయితే.. అతడి మానసిక సరిగా లేదని.. ఈ కారణంతోనే ఇలా చేస్తుంటాడని నిందితుడి భార్య చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీస్ జీపునే ఒక వ్యక్తి టార్గెట్ చేయటం సంచలనంగా మారింది.