Begin typing your search above and press return to search.

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు 65కోట్ల డ్రగ్స్.. చిక్కారిలా?

By:  Tupaki Desk   |   27 Jun 2020 2:00 PM GMT
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు 65కోట్ల డ్రగ్స్.. చిక్కారిలా?
X
దేశ సరిహద్దుల్లో జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో అతిపెద్ద ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నార్కోటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తూ లోయలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని తేలింది.

భారత ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 13.5 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.65 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

బారాముల్లా జిల్లాలోని బిజ్మా, లచీపోరా ప్రాంతాలకు చెందిన వారీగా వీరిని గుర్తించారు. వీరి వద్ద రెండు తుపాకులు, నాలుగు మ్యాగజైన్లు, 55 బుల్లెట్లు, నాలుగు హ్యండ్ గ్రెనేడ్లు, పది డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరు పీవోకేలో ఉంటున్న పలువురు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీరు ఉగ్రవాదులకు డ్రగ్స్, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.