Begin typing your search above and press return to search.
సచిన్ పై అసభ్యకర పోస్ట్.. తెలుగు యువకుడి అరెస్ట్ !
By: Tupaki Desk | 8 Aug 2020 5:30 PM GMTసమాజంలో సెలబ్రెటీలను టార్గెట్‌గా చేసుకొని అసభ్య పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ మధ్య కొందరికి బాగా అలవాటుగా మారిపోయింది. సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ , మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పడానికి , సెలెబ్రెటీల పై అసభ్యకర పోస్ట్ చేసే వారిని అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నా కూడా కొందరిలో ఎటువంటి మార్పు రావడంలేదు. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.
తన పోస్టులను ఎవరూ పట్టించుకోరులే అని అనుకున్నాడు. ఎక్కడో ముంబైలో ఉన్న సచిన్ దీనిపై స్పందించడులే అనుకున్నాడు. క్రమంగా సచిన్ కుటుంబ సభ్యులపైనా అసభ్యకరంగా పోస్ట్ పెడుతూ వచ్చాడు. దీనిపై సచిన్ ఫ్యామిలీ... ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది . దీనితో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు... ఆ పోస్టును చెక్ చేశారు. అది ఎక్కడ నుంచి, ఎవరు పెట్టారో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రెస్ తెలుసుకున్నారు. తర్వాత ఆ ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తున్న సంస్థకు కాల్ చేశారు. ఐపీ అడ్రెస్ నంబర్ చెప్పి... ఆ అడ్రెస్ వాడుతున్న వ్యక్తి వివరాలు కావాలన్నారు. రెండు నిమిషాల్లో పోలీసులకు నాగరాజు ప్రొఫైల్ వచ్చేసింది. . వెంటనే అతని ఊరికి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం ఉదయాన్నే అతని ఇంటికి వచ్చింది. వారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అసలు విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నేరుగా అక్కడి నుంచి ముంబైకు తరలించారు. ఇలా ఎవరు అక్రమ పోస్టులు పెట్టినా... సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ చర్యలు తప్పవు. కాబట్టి సోషల్ మీడియా లో పోస్టులు పెట్టేముందు కొంచెం వెనుక ముందు ఆలోచించుకోండి.