Begin typing your search above and press return to search.

నాన్ బెయిలబుల్ కేసు పెట్టేంతలా ఫిరోజ్ ఖాన్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   3 Oct 2020 1:30 AM GMT
నాన్ బెయిలబుల్ కేసు పెట్టేంతలా ఫిరోజ్ ఖాన్ ఏం చేశారు?
X
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే పరిణామాలు భలే విచిత్రంగా.. ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మజ్లిస్ నేతలన్నా.. ఆ పార్టీ అధినేత అసద్.. అక్బరుద్దీన్ లు అంటే చాలు.. అదే పనిగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ నేత ఒకరు ఉన్నారు. అతనే ఫిరోజ్ ఖాన్. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావటమే లక్ష్యంగా పెట్టుకొని.. కొన్నేళ్లుగా శ్రమిస్తున్నాడు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఆయన తర్వాత కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు.

నాంపల్లి నియోజకవర్గం నుంచి వరుస పెట్టి పోటీ చేస్తూ.. మజ్లిస్ ను ఓడించటమే తన లక్ష్యమని చెబుతుంటారు. అంతే కాదు.. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ యాక్టివ్ అన్న పేరుతో పాటు.. నిత్యం ఏదో ఒక యాక్టివిటితో బిజీబిజీగా ఉండే ఆయనకు మీడియాతోనూ చక్కటి సంబంధాలు ఉన్నాయి. అలాంటి ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. అరెస్టు చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. ట్యాంక్ బండ్ దగ్గర చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన్ను.. పలువురు కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదంతా ఎందుకంటే.. ఒక రిపోర్టర్ మీద చేయి చేసుకున్నాడన్న ఆరోపణ మీద. ఉత్తమ్ నిర్వహిస్తున్న ఆందోళన నేపథ్యంలో చుట్టూ ఉన్న వారిని పక్కకు తప్పించే క్రమంలో ఒక జాతీయ చానల్ కు చెందిన ప్రతినిధిని నెట్టినట్లుగా తెలుస్తోంది.

తాను విలేకరిని అని చెప్పటంతో.. జరిగిన దానికి సారీ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న వాదన.. ఆ సందర్భంగా సదరు రిపోర్టర్ చేసిన వ్యాఖ్య ఫిరోజ్ ఖాన్.. ఆయన అనుచరులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే.. సదరు రిపోర్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారనిచెబుతున్నారు. దీంతో.. సదరు రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. రాత్రికి రాత్రి ఫిరోజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరిపినట్లు తెలుస్తోంది.

పనిలో పనిగాఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించటమే కాదు.. నాన్ బెయిల్ బుల్ కేసుల్ని నమోదు చేయటం గమనార్హం. అంతేకాదు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరికి షాకింగ్ గా మారింది.. చిన్న ఇష్యూకు ఫిరోజ్ ఖాన్ మీద నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో తాను యాక్టివ్గ గా ఉండటం ద్వారా మజ్లిస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారని.. టైం చూసుకొని దెబ్బేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని నేరాల విషయంలో హైదరాబాద్ పోలీసులు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇందుకు వారేమంటారో?