Begin typing your search above and press return to search.

ఆ హైకోర్టు లాయర్ దెబ్బకు తిరుపతిలో ఉద్రిక్తత

By:  Tupaki Desk   |   2 Oct 2020 5:31 PM GMT
ఆ హైకోర్టు లాయర్ దెబ్బకు తిరుపతిలో ఉద్రిక్తత
X
తిరుపతి పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హైకోర్టు న్యాయవాది శ్రవణ్ పుణ్యమా అని ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పట్టణం.. సదరు హైకోర్టు న్యాయవాది తీసుకున్న నిర్ణయంతో వాతావరణం మారింది. అప్పటివరకు ఆయన బస చేసిన హోటల్ వద్ద ఎలాంటి పోలీసు బందోబస్తు లేనిది.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. హోటల్ ముందు భారీ ఎత్తున బందోబస్తు పెట్టేసిన పోలీసులు.. ఆయన్ను హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా హోటల్ బయట పెద్ద ఎత్తున సెక్యురిటిని పెట్టేశారు.

ఇంతకూ జరిగిందేమంటే.. మొన్ననే జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రరావుపై దాడి జరగటం.. ఇదో వివాదం మారటం తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన హైకోర్టు లాయర్ శ్రవణ్.. ఈ రోజు ఉదయం ఉన్నట్లుండి చలో మదనపల్లె పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. ఆయన పిలుపుతో టీడీపీ వర్గాలు హోటల్ వద్దకు చేరుకున్నాయి. ఈ విషయాల్ని తెలుసుకున్న పోలీసులు.. హోటల్ బయటకు న్యాయవాది శ్రవణ్ ను రానివ్వటం లేదు.

మరోవైపు టీడీపీ కార్యకర్తలు.. నేతలు శ్రవణ్ ను బయటకు పంపాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. హోటల్ గదిలో నిర్బంధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఒక్కసారిగా మారిపోయి.. దళిత సంఘాల నేతలు హోటల్ ఆవరణ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఆయన్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పరామర్శకు వచ్చిన పెద్ద మనిషి ఆ పని చేయకుండా.. ఈ హడావుడి చేయటం ఏమిటో?