Begin typing your search above and press return to search.
ఉస్మానియాలో బీజేపీ ఎంపీ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
By: Tupaki Desk | 24 Nov 2020 6:20 PM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగుతోంది. బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్రం నుంచి బీజేపీ నేతలను హైదరాబాద్ లో దించి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. బీజేపీ ఎంపీ, బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేటు దగ్గర బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తేజస్వితోపాటు బీజేపీ నేతలు కూడా యూనివర్సిటీలోకి వెళ్లడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కార్యకర్తలతో కలిసి ఎంటరైన తేజూస్వి సూర్య ఆర్ట్స్ కాలేజీ వద్ద యువనేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని తేజస్వి విమర్శించాడు.
కాగా తేజస్వి యాదవ్ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీ లేదని.. అక్కడ ప్రచారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అడ్డుకున్నారు.