Begin typing your search above and press return to search.
వీక్‌నెస్సే వారి బలం: బెంగళూరులో రెచ్చిపోతున్న వ్యభిచార ముఠాలు
By: Tupaki Desk | 9 July 2020 12:30 AM GMTవ్యభిచార నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్లు లాక్‌డౌన్ తో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అన్‌లాక్ దశ మొదలై సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో ప్రస్తుతం వ్యభిచార కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైటెక్ పరిజ్ఞానంతో తమ దందా కొనసాగిస్తున్నారు. తాజాగా అలాంటి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ హబ్‌గా పేరున్న బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు.
ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బెంగళూరులోని యశ్వంత్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ అతిథిగృహంపై బుధవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వారి చెరలో ఐదుగురు యువతులు ఉన్నారు. వారిని రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. గతవారమే సీసీబీ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఆ ముఠా చెరలో ఉన్న 27 మంది మహిళలను కాపాడారు. మళ్లీ ఇప్పుడు బెంగళూరులో మరో ముఠా వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు వ్యభిచార నిర్వాహకులపై ఫోకస్ పెట్టారు. వీరంతా లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉంటున్నవారిని లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నారని తెలిసింది. మరిన్ని వ్యభిచార ముఠాలు ఉన్నాయని.. వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు.