Begin typing your search above and press return to search.
వీడిన గన్నవరం మిస్సింగ్ మహిళ మిస్టరీ .. అసలు కారణం ఏంటంటే ?
By: Tupaki Desk | 22 Dec 2020 11:13 AM GMTగన్నవరం విమానాశ్రయం లో మహిళ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఈ మహిళ మిస్సింగ్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లో అసలు మిస్టరీ ఏమిటో బయటపెట్టేశారు. టెక్నాలజీ సాయంతో ఆ మహిళ ఆచూకీని కనిపెట్టారు. ఆమె కడప జిల్లా ప్రొద్దటూరులో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆమెను తీసుకొచ్చారు.
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే .. పశ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, నెలమూరుకు చెందిన భార్యభర్తలు జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే , ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం ఆ కుటుంబంలోని మహిళ ఉపాధి కోసం కువైట్ కి వెళ్ళింది. రెండుసార్లు స్వగ్రామానికి వచ్చివెళ్లింది. మూడోసారి ఇండియాకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వకుండానే వచ్చేసిన ఆ మహిళ.. సైలెంట్ గా కడప జిల్లా ప్రొద్దటూరు వెళ్లింది. ఐతే దుబాయ్ లో ఉన్న ఆమె స్నేహితురాలు, ఇంటికి వచ్చిందా అంటూ భర్త కు ఫోన్ చేయడంతో ఆయన కంగారుపడి ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎయిర్ పోర్ట్ సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎయిర్ పోర్టులో ఆమె దిగినట్లు కెమెరాల్లో రికార్డయినా.. ఎయిర్ పోర్ట్ బయట కెమెరా పనిచేయకపోవడంతో ఆమె ఎటువెళ్లిందన్నది తెలియరాలేదు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ నెంబర్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గాలించగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నట్లు తేలింది.
అయితే , ఆ మహిళా కువైట్ లో ఉన్న సమయంలో మరోవ్యక్తి ఆమెతో క్లోజ్ గా ఉండేవాడు అని, ఆ విషయాన్ని పసిగట్టడంతో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు వచ్చాయని , ఫోన్ లో తిట్టేవాడని, అందుకే తన కూతురు భర్త దగ్గరికి వెళ్లలేదని ఆమె అమ్మ చెప్పుకొచ్చింది.అలాగే కువైట్ నుంచి ఆ వ్యక్తి బుక్ చేసిన వాహనంలోనే ఆమె కడపకు వెళ్లినట్టు విచారణ బృందం నిర్ధారణకు వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో దంపతుల మధ్య మనస్పర్థలు రావడానికి కువైట్ లో ఆమె తో క్లోజ్ గా మూవ్ అయిన వ్యక్తి ఓ పథకం ప్రకారం వేసిన ఎత్తుగడలే కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనితో దుర్గ ప్రొద్దూటూరు నుంచి గన్నవరానికి 21వ తేదీ సాయంత్రం చేరుకుంది. భర్తతో తనకు కువైట్ లో ఉన్నపుడే గొడవలు అయ్యాయని, ఇండియా బయల్దేరే ముందు కూడా ఫోన్ లో గొడవలు అవటంతో భయమేసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేదని దుర్గ పోలీసులకు చెప్పింది. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తర్వాత ఓలా బుక్ చేసుకుని ప్రొద్దుటూరులో ఉన్న చెల్లెఇంటికి వెళ్ళినట్టు దుర్గ వివరించింది. దీనితో భర్త సత్యనారాయణకు, దుర్గకు కౌన్సిలింగ్ చేసి పంపటంతో కథ సుఖాంతమైంది.